Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

స్టేషన్‌కు వాస్తు దోషమా? రెండున్నరేళ్లలో ఏడుసార్లు ఎస్సైల మార్పు

Author
Posted By TELANGANA KERATAM
| 02 Nov 2026, 10:55 AM | 78 | EDITORIAL, తెలంగాణ
స్టేషన్‌కు వాస్తు దోషమా? రెండున్నరేళ్లలో ఏడుసార్లు ఎస్సైల మార్పు
సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పోలీస్‌స్టేషన్‌లో అధికారుల మార్పుల పరంపర కొనసాగుతోంది.

గంభీరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పోలీస్‌స్టేషన్‌లో అధికారుల మార్పుల పరంపర కొనసాగుతోంది. స్టేషన్‌కు ఏమైంది..? ఇక్కడ విధులు నిర్వహించాలంటే అధికారులకు ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా..? లేక స్టేషన్‌కు వాస్తు దోషమేమైనా ఉందా..? అంటూ స్థానికుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. 2024 ఏప్రిల్ నుంచి 2026 అక్టోబర్ వరకు సుమారు రెండున్నరేళ్ల వ్యవధిలో ఆరుగురు ఎస్సైలు మారగా, ఏడుసార్లు బాధ్యతల మార్పు జరిగినట్లు అందుబాటులో ఉన్న వివరాలు చెబుతున్నాయి.

వచ్చిన కొద్దిరోజులకే మార్పు!

ఒక పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై కొంతకాలం కొనసాగితేనే స్థానిక పరిస్థితులు, గ్రామాల సమస్యలు, శాంతిభద్రతలు, పెండింగ్ కేసులపై పూర్తి అవగాహన ఏర్పడుతుంది. కానీ గంభీరావుపేట పోలీస్‌స్టేషన్‌లో మాత్రం తరచూ అధికారుల మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీంతో కొత్తగా బాధ్యతలు చేపట్టిన అధికారి పరిస్థితులను అర్థంచేసుకునేలోపేమార్పులు జరుగుతున్నాయనఅభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదీ అధికారుల మార్పుల వరుస!

రామ్మోహన్ – 8 నెలలు

శివకుమార్ – 2 నెలలు

శ్రీకాంత్ – 5 నెలలు

ప్రేమానందం – 2 నెలలు

రమాకాంత్ – 2 నెలలు

అనిల్ కుమార్ – 10 నెలలు

శ్రీకాంత్ – 4 నెలలు

ఈ వరుసను పరిశీలిస్తే కొందరు అధికారులు స్వల్పకాలంలోనే స్టేషన్‌ను వీడగా, మరికొందరు మాత్రమే కొంతకాలం కొనసాగినట్లు తెలుస్తోంది

 అసలు కారణాలేమిటి?

అధికారుల బదిలీలకు పరిపాలనాపరమైన కారణాలున్నాయా..? ఉన్నతాధికారుల నిర్ణయాలా..? లేక ఇతర పరిస్థితుల ప్రభావమా..? అన్నది తెలియాల్సి ఉంది. ఎవరొచ్చినా ఎక్కువకాలం కొనసాగకపోవడంతో కొందరు స్థానికులు సరదాగా స్టేషన్‌కు వాస్తు దోషమేమైనా ఉందా అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అయితే తరచూ అధికారుల మార్పులకు గల వాస్తవ కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది

స్థిరత్వం ఎప్పుడొస్తుంది?

ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాల్సిన పోలీస్‌స్టేషన్‌లో అధికారుల మార్పులు తరచూ చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. కొత్తగా వచ్చే అధికారులకు స్థానిక పరిస్థితులపై అవగాహన ఏర్పడటానికి సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో స్టేషన్‌లో అధికారుల స్థిరత్వానికి ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

నూతన ఎస్సైని నియమించాలి!

గంభీరావుపేట పోలీస్‌స్టేషన్‌లో తరచూ ఎస్సైల మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతం స్టేషన్‌కు పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టే నూతన ఎస్సైని నియమించాలని మండల ప్రజలు కోరుతున్నారు. స్థానిక పరిస్థితులపై అవగాహన కలిగి, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు నిరంతరం అందుబాటులోఉండేఅధికారిని నియమించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తరచూ అధికారులమార్పులకుస్వస్తిపలికి, పోలీస్‌స్టేషన్‌లో పాలనాపరమైన స్థిరత్వం తీసుకురావాలనిఉన్నతాధికారులను కోరుతున్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: