Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ప్రభుత్వ విప్ ఆది కృషితో కమ్యూనిటీ హాల్ నిర్మాణ భూమి పూజ

Author
Posted By TELANGANA KERATAM
| 01 Nov 2026, 09:51 PM | 3 | Politics, తెలంగాణ
ప్రభుత్వ విప్ ఆది కృషితో కమ్యూనిటీ హాల్ నిర్మాణ భూమి పూజ

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 01 : 

కథలాపూర్ మండలం భూషణరావుపేట గ్రామంలోని అంబేద్కర్ యువజన మాల సంఘం భవనం నిర్మాణ నిమిత్తం ఆదివారం సంఘ పెద్దలు, సభ్యుల ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బద్దం మహేందర్, సింగిల్ విండో చైర్మన్ గడ్డం స్వామి రెడ్డి, ఏఎంసి డైరెక్టర్ వాకిటి రాజారెడ్డి, ఫ్యాక్స్ డైరెక్టర్ కూన అశోక్, స్థానిక కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు తలారి మోహన్, సీనియర్ పాత్రికేయుడు బుర్రి గణేష్, ఐదో వార్డు సభ్యురాలు అంబటి సంగీతలు పాల్గొని నిర్మాణ పనులను ప్రారంభించారు. పూజా కార్యక్రమంలో పుణ్య దంపతులుగా మాజీ సర్పంచ్ కూన సులోచన శ్రీనివాస్ దంపతులు పాల్గొన్నారు, ఈ సందర్భంగా కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు తలారి మోహన్ మాట్లాడుతూ.. స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తాను శాసన సభ్యులుగా ఎన్నికైన తొలి నాళ్లలో మాకు కమ్యూనిటీ హాల్ అవసరమై ఉన్నదని తెలపగానే, వెంటనే స్పందించిన ఆయన ఇట్టి భవన నిర్మాణానికి గాను ఎస్డిఎఫ్ నిధుల నుండి మూడు లక్షల రూపాయల ప్రొసీడింగ్ ను అందించడం జరిగిందని, భవన నిర్మాణానికి ఆయా నిధులను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలిపారని పేర్కొన్నారు. కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించినందుకు గాను గ్రామ కాంగ్రెస్ పార్టీ తరఫున, అంబేద్కర్ యువజన మాల సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన మాల సంఘం అధ్యక్షులు కారంగుల శ్రీనివాస్, పులి మారుతి తదితర సంఘ సభ్యులు పాల్గొన్నారు,

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: