Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఖేలో ఇండియా పోటీలకు అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో కూడిన శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చెయ్యాలి : సీఎం రేవంత్ రెడ్డి

Author
Posted By TELANGANA KERATAM
| 03 Nov 2026, 09:02 AM | 4 | Politics, తెలంగాణ
ఖేలో ఇండియా పోటీలకు అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో కూడిన శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చెయ్యాలి : సీఎం రేవంత్ రెడ్డి
ఖేలో ఇండియా పోటీలకు అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో కూడిన శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చెయ్యాలి : సీఎం రేవంత్ రెడ్డి
ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లకు సంబంధించిన అన్ని వనరులను ఖేళో ఇండియా 2026 పోటీలకు సైతం ఉపయోగించుకునేలా సమాంతరంగా ఖేళో ఇండియా పోటీల ఏర్పాట్లు 
డిసెంబర్ 11 నుంచి 22 వరకు తెలంగాణలో నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 8వ ఎడిషన్ క్రీడల పోటీల నిర్వహణ ఏర్పాట్లపై MCRHRDలో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ఈ పోటీలకు ఎక్కడా ఏర్పాట్లలో నాణ్యతా ప్రమాణాల లోపం లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఈ సందర్భాంగా ఆదేశించారు.

 ఖేలో ఇండియా పోటీలకు అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో కూడిన శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చెయ్యాలి : సీఎం రేవంత్ రెడ్డి. 



తెలంగాణ క్రీడా విధానం, యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే క్రీడల హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఈ పోటీలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించడమే దీర్ఘ కాలిక లక్ష్యంగా అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు, ప్రపంచస్థాయి క్రీడా శిక్షణను తెలంగాణ యువ క్రీడాకారులకు అందించేందుకు ఈ పోటీలు ఒక గొప్ప అవకాశంగా మలుచుకోవడం ప్రభుత్వ ఉద్దేశమని ఈ సందర్భాంగా సీఎం అన్నారు.

ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లకు సంబంధించిన అన్ని వనరులను ఖేళో ఇండియా పోటీలకు సైతం ఉపయోగించుకునేలా సమాంతరంగా ఖేళో ఇండియా పోటీల ఏర్పాట్లు చెయ్యాలని సీఎం సూచించారు. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో క్రీడలు, క్రీడాభివృద్ధికి సంబంధించిన పెట్టుబడుల ఆకర్షణ కూడా ఒక భాగం అయినందున అధికారులందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు.

యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి వారిని అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలన్నారు. అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో క్రీడా ప్రాంగణాలను తీర్చిదిద్ది ఖేళో ఇండియా పోటీల తర్వాత కూడా అవి గొప్ప క్రీడా వనరులుగా ఉపయోగపడేలా చూడాలన్నారు.

ఏర్పాట్లలో నాణ్యతా ప్రమాణాల లోపం లేకుండా పటిష్ట చర్యలు తీసుకునే విధంగా గ్రూప్-1 స్థాయి అధికారులకు ఏర్పాట్ల నుంచి క్రీడలు ముగీసే వరకు పర్యవేక్షణా బాధ్యతలు అప్పగించాలన్నారు. వివిధ జిల్లాల్లో జరగనున్న పోటీలకు సంబంధించి ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం ఆయా చోట్ల స్థానికంగా పనిచేస్తున్న ట్రైనీ అధికారులు, గ్రూప్-1 అధికారులను నియమించాలన్నారు. 

క్రీడాకారులకు ఆహారం, వసతి సౌకర్యాల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. ప్రతి వారం ఏర్పాట్ల పురోగతిపై సమాచారమివ్వాలన్నారు. 

కాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో క్రీడా పోటీల్లో జరిగిన పరిణామాలు నివృత్తి కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గత ప్రభుత్వ పాలనలో క్రీడలకు కొన్ని చోట్ల చేపట్టిన మౌలిక సదుపాయాల పనులు క్రీడా పోటీలు ముగిసిన కొన్నేళ్ళలోనే విచ్ఛిన్నం అయ్యాయని గుర్తు చేశారు.

ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో క్రీడా పోటీల ప్రారంభ, ముగింపు వేడుకల్లో అనవసరమైన ఆడంబరాలకు తావు లేకుండా జాగ్రత్త తీసుకోవాలన్నారు.

డిసెంబరు 11 నుంచి 22 వరకు జరిగే ఖేలో ఇండియా క్రీడా పోటీలకు దేశవ్యాప్తంగా వేలాది మంది యువ క్రీడాకారులు పాల్గొననున్నారు. ఏడు వేలకు పైగా యువ క్రీడాకారులతో పాటు సుమారు రెండు వేల మంది కోచింగ్ సిబ్బంది, అధికారులు రాష్ట్రానికి రానున్నారు. 

రాష్ట్రంలో హైదరాబాద్ సహా 6 నగరాల్లో 20 చోట్ల 27 రకాల క్రీడా పోటీలు, ఒక డెమో పోటీ నిర్వహించనున్నారు. తెలంగాణ కర్రసాము క్రీడను కూడా ఆతిధ్య రాష్ట్ర కోటాలో ఖేలో ఇండియా క్రీడల్లో చేర్చే విధంగా వెంటనే కార్యాచరణ చేపట్టాలని సీఎం సూచించారు.

ఈ పోటీల్లో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించే క్రీడాకారులు సత్తా చాటే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే వివిధ జిల్లాల్లో ఖేలో ఇండియా శిబిరాల్లో క్రీడాకారులు శిక్షణ పొందుతున్నారు. వివిధ క్రీడల పోటీల నిర్వహణ కోసం 20 వేదికల్లో చేపడుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులు వివరించారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎం సలహాదారు కె. రామకృష్ణా రావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (స్పోర్ట్స్) వాణీ ప్రసాద్, స్పోర్ట్స్ అథారిటీ ఎండీ సోనిబాలా దేవి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఖేలో ఇండియా పోటీలకు అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో కూడిన శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చెయ్యాలి : సీఎం రేవంత్ రెడ్డి
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: