పాత కక్షలతో వ్యక్తిపై బీరు సీసాతో కిరాతక దాడి..
ట్రాక్టర్తోనూ హల్చల్! నిందితుడు అరెస్ట్, రిమాండ్
రామారెడ్డి నవంబర్ 2, తెలంగాణ కెరటం ప్రతినిధి) కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో పాత కక్షలు మరోసారి హిన్సకు దారితీశాయి. ఓ వ్యక్తిపై కక్ష పెంచుకున్న దుండగుడు మార్గమధ్యలో అడ్డగించి బీరు సీసాతో విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి నింది తుడిని రామారెడ్డి పోలీసులు వేగంగా స్పందించి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేస్ తాలూకు పూర్తి వివరాలను రామారెడ్డి ఎస్ఐ టీ. మురళి మీడియాకు వెల్లడించారు. గొడవలు మనసులో పెట్టుకుని.. స్థానికంగా గతంలో తలెత్తిన కొన్ని వివాదాలు, గొడవల నేపథ్యంలో బాధితుడిపై నిందితుడు గంగావత్ సురేష్ తీవ్ర కక్ష పెంచుకు న్నాడు. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని కుట్ర పన్నిన సురేష్, అదను కోసం వేచి చూశాడు. మార్గ మధ్యలో అడ్డగించి.. బీరు సీసాతో దాడి పథకం ప్రకారం అక్టోబర్ 30, 2026 రాత్రి సమయంలో రెడ్డిపేట నుంచి తన స్వగ్రామానికి బయలుదేరిన బాధితుడిని నిందితుడు గంగావత్ సురేష్ మార్గ మధ్యలో అకస్మాత్తుగా అడ్డగించాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిన సమయంలో, క్షణికావేశంలో నూ, పాత కక్షల కసితోనూ నిందితుడు తెచ్చుకున్న బీరు సీసాతో బాధితుడిపై దాడికి దిగాడు. ఈ దా డిలో బాధితుడి కుడి కాలికి తీవ్ర గాయాలయ్యా యి. ట్రాక్టర్‌తో ఇంటిపైకి దాడి యత్నం.. అంతటితో శాంతించని నిందితుడు సురేష్, మరింత రెచ్చి పోయాడు. గాయపడి ఇంటికి చేరిన బాధితుడిని వెంబడిస్తూ నేరుగా బాధితుడి ఇంటి వద్దకు ట్రా క్టర్‌తో వెళ్లాడు. ట్రాక్టర్ తో భయభ్రాంతులకు గురిచే స్తూ మరోసారి దాడి చేసేందుకు యత్నించినట్లు బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ ఘటనతో బాధితుడి కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గుర య్యారు. కేసు నమోదు.. వేగవంతమైన దర్యాప్తు, రిమాండ్... బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామారెడ్డి పోలీసులు వెంటనే స్పందించి కేసు నమోదు చేసుకున్నారు. ఎస్ఐ టీ. మురళి ఆదే శాల మేరకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి దర్యాప్తును వేగవంతం చేశాయి. ఈ క్రమంలో నిందితుడు గంగావత్ సురేష్‌ను సోమవారం అదు పులోకి తీసుకున్న పోలీసులు, తదుపరి విచారణ నిమిత్తం కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు నిందితుడిని రిమాండ్‌కు తరలిం చినట్లు ఎస్ఐ తెలిపారు. శాంతిభద్రతలకు విఘా తం కలిగిస్తే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని, రౌడీషీటర్లు, గొడవలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.
