Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

నందిపేట మండలం కొత్తూరు గ్రామంలో ఆదివాసుల ఆరాధ్య దైవమైన భీమన్న గుడి గద్దెను (బేస్‌మెంట్) అధికారులు అక్రమంగా కూల్చివేయడంపై ఆదివాసి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయ

Author
Posted By TELANGANA KERATAM
| 26 Nov 2026, 04:49 PM | 3 | Politics, తెలంగాణ
నందిపేట మండలం కొత్తూరు గ్రామంలో ఆదివాసుల ఆరాధ్య దైవమైన భీమన్న గుడి గద్దెను (బేస్‌మెంట్) అధికారులు అక్రమంగా కూల్చివేయడంపై ఆదివాసి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయ

నందిపేట మండలం కొత్తూరు గ్రామంలో ఆదివాసుల ఆరాధ్య దైవమైన భీమన్న
గుడి గద్దెను (బేస్‌మెంట్) అధికారులు అక్రమంగా కూల్చివేయడంపై ఆదివాసి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయ.

ఆదివాసుల ఆరాధ్య దైవం 'భీమన్నగుడి గద్దె కూల్చివేత.. అధికారుల తీరుపై *ఆదివాసుల ఆగ్రహం

నిజామాబాద్ జిల్లా (తెలంగాణ కెరటం)

నందిపేట మండల కేంద్రంలోని కొత్తూరు గ్రామంలో ఆదివాసులు ఎంతో భక్తిశ్రద్ధలతో కొలుచుకునే తమ ఆరాధ్య దైవం భీమన్న గుడి బేస్‌మెంట్‌ను (గద్దెను) అధికారులు రాత్రికి రాత్రే అక్రమంగా కూల్చివేయడం తీవ్ర కలకలం రేపుతోంది.ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, కనీస ఆధారాలు పరిశీలించకుండా ఎమ్మార్వో (తహసీల్దార్), ఇరిగేషన్ శాఖ అధికారులు రాత్రి సమయంలో జేసీబీలతో వచ్చి గుడి నిర్మాణాన్ని నేలమట్టం చేశారని ఆదివాసి కులస్తులు ఆరోపిస్తున్నారు. ఈ చర్య తమ ఆదివాసి సాంప్రదాయాలను, కట్టుబాట్లను, ఆత్మగౌరవాన్ని తీవ్రంగా కించపరిచేలా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.తమ కుల దైవమైన భీమన్న గుడి బేస్‌మెంట్‌ను అక్రమంగా కూల్చివేసిన సంబంధిత అధికారులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదివాసి సంఘాల నాయకులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: