మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 26 : కోరుట్ల మున్సిపల్ కార్యాలయంలో గురువారం భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి తిరుమల వసంత గంగాధర్, మున్సిపల్ కమిషనర్ రాఘవేంద్ర. వైస్ చైర్ పర్సన్ మహమ్మద్ షాహెద్ ఉల్ అహద్, వార్డు కౌన్సిలర్ లు, ప్రజా ప్రతినిధులు, కార్యాలయ సిబ్బంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.



