పుట్టు పంచల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్
తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 26, నవంబర్
పటాన్చెరు పట్టణంలోని ఎల్లమ్మ ఆలయం వద్ద శ్రీమతి మెట్టు అమరమ్మ – యాదయ్య యాదవ్ దంపతుల కుమారుడు మెట్టు యశ్విక్ యాదవ్, కుమార్తె మేధస్వి గార్ల పుట్టు పంచల వేడుకను కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.ఈ శుభకార్యానికి పటాన్చెరు మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, చిన్నారులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్థానిక ప్రముఖులు పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు.



