వెల్దుర్తిలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
(తెలంగాణ కెరటం) వెల్దుర్తి నవంబర్ ప్రతినిధి 26
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు బి. సాంబయ్య మాట్లాడుతూ భారత రాజ్యాంగ ప్రాముఖ్యత, ప్రజాస్వామ్య విలువలు, పౌరుల హక్కులు, బాధ్యతలను వివరించారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించిందని, 1950 జనవరి 26 నుంచి అమలులోకి వచ్చిందని తెలిపారు. రాజ్యాంగ రూపకల్పనలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే మౌలిక విలువలను విద్యార్థులు జీవితంలో ఆచరించాలని, మంచి పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు.విద్యార్థుల్లో రాజ్యాంగంపై అవగాహన పెంచేందుకు డ్రాయింగ్, వ్యాసరచన పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకట్ రెడ్డి, ధనరాజ్, రాము, శ్రీనివాసరావు, వెంకటస్వామి, ఖదీర్ పాషా, చార్లెస్, జయసుధ, శైలజ, అమూల్య, ప్రశాంతి దేవి, విద్యార్థులు పాల్గొన్నారు.



