చిన్నమెట్పల్లి గ్రామంలో ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభం
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 27 : కోరుట్ల మండలం చిన్నమెట్పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు ఆధ్వర్యంలో శుక్రవారం గ్రామపంచాయతీ నిర్వహణలో ఇందిరమ్మ బీమా పథకంను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మహమ్మద్ రహీం మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ బీమా పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరూ లబ్ధి పొందాలని, గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మహమ్మద్ రహీం, ఉప సర్పంచ్ శ్రీమతి వెలుమల మంజుల ఏకంబర్, కార్యదర్శి హకీమ్, వార్డు సభ్యులు, గ్రామపంచాయతీ సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పథకం లబ్ధిదారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.



