Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

విమర్శలతో ఈటలను అడ్డుకోలేరు! అభివృద్ధి, అనుభవమే ఆయన బలం

Author
Posted By TELANGANA KERATAM
| 28 Nov 2026, 06:32 PM | 10 | Politics, తెలంగాణ
విమర్శలతో ఈటలను అడ్డుకోలేరు! అభివృద్ధి, అనుభవమే ఆయన బలం

హుజూరాబాద్‌లో కౌశిక్ రెడ్డి విమర్శలతో వేడెక్కిన రాజకీయం.. ప్రజాక్షేత్రంలో సమాధానానికి సిద్ధమవుతున్న ఈటల

హన్మకొండ ప్రతినిధి: తెలంగాణ కెరటం నవంబర్ 28 హుజూరాబాద్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం మొదలైంది. ఈటల రాజేందర్‌పై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన విమర్శలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. అయితే విమర్శలతో ఈటల రాజకీయ ప్రస్థానాన్ని చెరపలేరని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు.రెండు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం, ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన గుర్తింపు ఈటలకు బలమని చెబుతున్నారు. హుజూరాబాద్‌లో ఓటమి తర్వాత కూడా వెనక్కి తగ్గకుండా మల్కాజిగిరి ఎంపీగా గెలిచి తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారని గుర్తు చేస్తున్నారు.కౌశిక్ రెడ్డి సంధించిన ఐదు ప్రశ్నలకు బదులుగా వ్యక్తిగత విమర్శలు కాకుండా అభివృద్ధి పనులపై బహిరంగ చర్చ జరగాలని ఈటల మద్దతుదారులు కోరుతున్నారు. రైతుల సమస్యలు, సాగునీరు, విద్యుత్, రహదారులు, తాగునీరు వంటి అంశాలపై నాయకులందరూ తమ పనుల లెక్కలు ప్రజల ముందు ఉంచాలని అంటున్నారు.మాటల యుద్ధం పక్కనపెట్టి ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని, విమర్శలకు ప్రజాక్షేత్రంలోనే సమాధానం చెప్పాలని ఈటల అనుచరులు అభిప్రాయపడుతున్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: