Saturday, May 23, 2026
HomeUncategorizedఅక్రమ అరెస్టులతో ముదిరాజుల ఉద్యమాన్ని అణచలేరు!

అక్రమ అరెస్టులతో ముదిరాజుల ఉద్యమాన్ని అణచలేరు!

📰 Generate e-Paper Clip

ముదిరాజులను బిసి “ఏ” లోకి మారుస్తా అని ఇచ్చిన హామీని రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలి జి.ఓ 15/09 అమలు చేయకుండా జాప్యం చేస్తున్న రేవంత్ రెడ్డి గారిని అరెస్టు చేయలి! ఉచిత చేపపిల్లల పంపిణీ లేదు, సబ్సిడీ లోన్స్ లేవు, సబ్సిడీ వాహనాలు లేవు, బిసి “ఏ”లోకి మార్చే మాట కూడా తప్పితివి రేవంత్ రెడ్డి! గాంధీభవన్ ముట్టడికి వెళ్లకుండా అరెస్టు చేసిన ముదిరాజులను తక్షణమే విడుదల చేయాలి! ముదిరాజులను బిసి ఏలోకి ఈ ఏప్రిల్ నెలలో మార్చకుంటే మే 15న అసెంబ్లీ ముట్టడిస్తాం! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్
ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు

తెలంగాణ కెరటం సిద్దిపేట్ జిల్లా ప్రతినిధి చిన్నకోడూరు న్యూస్

చిన్నకోడూరు పోలీసులు ముదిరాజ్ ఉద్యమకారులను ఉస్మానియా యూనివర్సిటీ ముదిరాజ్ చైతన్య వేదిక తలపెట్టిన గాంధీభవన్ ముట్టడికి వెళ్లకుండా అరెస్టు చేసిన సందర్భంగా ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా మూడు సంవత్సరాలు కావస్తున్న కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో ముదిరాజులకు ఇచ్చిన హామీ ముదిరాజులను బిసి ఏలో మారుస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి మా పట్ల నిర్లక్ష్యం వహించడం సరైనది కాదని నీ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగానే ఈరోజు ఓయూ ముదిరాజ్ చైతన్య వేదిక గాంధీ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టిందని అట్టి కార్యక్రమానికి ముదిరాజ్ హక్కుల సాధన సమితి పూర్తి మద్దతునిస్తూ రేవంత్ రెడ్డి ఇవాళ మీరు మాట తప్పడం కాదు ఆనాడు మాట ఇస్తూ ముదిరాజులను బీసీ “ఏ” లోకి మారుస్తానన్న మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాన్ని ఈరోజు మేము అడుగుతా ఉన్నాం తక్షణమే ముదిరాజులను బిసి ఏలోకి మార్చమని ముదిరాజులను బిసి “ఏ” లోకి గనక మార్చకుంటే మే 15న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేస్తామని హెచ్చరించారు అరెస్ట్ అయిన వారిలో ముదిరాజ్ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ మాజీ సర్పంచ్ పరశురాములు ముదిరాజ్ జంగిటి ఆనందం ఏయ్య రాజయ్య గుడిపల్లి వికాస్ లు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments