Saturday, May 23, 2026
HomeUncategorizedకిషన్ రావు పేట గ్రామ శాఖ నూతన అధ్యక్షుడిగా పూదరి రాజేందర్

కిషన్ రావు పేట గ్రామ శాఖ నూతన అధ్యక్షుడిగా పూదరి రాజేందర్

📰 Generate e-Paper Clip

తెలంగాణ కెరటం ధర్మపురి నియోజకవర్గ ప్రతినిధి మార్చి 26

రాష్ట్ర భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ,మాజీ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కిషన్ రావుపేట గ్రామంలో గురువారం భారస నూతన గ్రామ కమిటి ని మండల పార్టీ అధ్యక్షులు చల్లూరి రాంచంద్రం గౌడ్ అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి జూపాక కుమార్ మాజీ ఏఎంసీ చైర్మన్ పత్తిపాక వెంకటేష్ వర్మ నేతృత్వంలో గ్రామ శాఖ అధ్యక్షుడు గా పూదరి రాజేందర్ ను,యువత అధ్యక్షులు గా తరాళ్ల శేఖర్, గ్రామ ప్రధాన కార్యదర్శి మోకేనపెళ్లి సాగర్,ఉపాధ్యక్షులు గా గౌరు తిరుపతి, లను ఏకగ్రీవంగా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా బి ఆర్ఎస్ పార్టీ నాయకులు పత్తిపాక వెంకటేష్ వర్మ చల్లూరి రామచందర్ గౌడ్ జుపాక కుమార్ లు మాట్లాడుతూ రాష్ట్రం లో నిరంకుశ పాలన సాగుతోందని,ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి ,కేవలం వారి అభివృద్ధి కోసమే అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని, రాబోయే కాలం లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన ప్రతిఫలం అందిస్తారని,2029 ఎన్నికల్లో తిరిగి రాష్ట్రం ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉంటారని తెలుపుతూ పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరు బాధ్యత గా ఉండలనికాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని సూచించారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మూగల సత్యం,పెద్దూరి భరత్, బాలసాని సత్యం, కొప్పుల సురేష్, కుమ్మరి వెంకటేష్,నైనాల అజయ్,ఇట్టాం నర్సయ్య,మెరుగు కొమురయ్య,భోగే రాజయ్య,అల్గునూరి సతీష్,వనపర్తి శ్రీనివాస్,పిట్టల నాగరాజు,మోకేనపెళ్లి బాబు,ఇట్టాం తిరుపతి, కళ్ళు నారాయణ,కండ్లే మధుకర్,పులి రమేష్,ప్రశాంత్,ఢాంక రాజేందర్, ఎదునూరి చందు, కంచెట్టి రాజేందర్ ,భోగే ప్రేమ్ సాగర్, మహేందర్ బి ఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments