Saturday, May 23, 2026
HomeUncategorizedఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం: పట్టు వస్త్రాలు సమర్పించిన జువ్వాడి. నర్సింగరావు

ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం: పట్టు వస్త్రాలు సమర్పించిన జువ్వాడి. నర్సింగరావు

📰 Generate e-Paper Clip

తెలంగాణ కెరటం ధర్మపురి నియోజకవర్గ ప్రతినిధి మార్చి 27

శ్రీరామ నవమి పర్వదినం పురస్కరించుకొని జగిత్యాల జిల్లా ధర్మపురి ఆలయ అనుబంధాలయమైన తిమ్మాపూర్ గ్రామంలోని శ్రీ సీతారామ స్వామి ఆలయం ఆవరణలో ధర్మపురి ఆలయ వేద పండితులతో శ్రీ సీతారామ స్వామి కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా భక్తుల నేత్రాలకు కనువిందుగా కడువేడుకగా నిర్వహించారు ఈ కళ్యాణ మహోత్సవం కు తిమ్మాపూర్ గ్రామ వాస్తవ్యులు మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి దివంగత నేత జువ్వాడి రత్నాకర్ రావు తనయులు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు స్వగృహం నుండి స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలను తీసుకువెళ్లి కార్యక్రమం మేళతాళాలతో కడు వేడుకగా తీసుకువెళ్లి స్వామివారికి సమర్పించి గ్రామ సర్పంచ్ నలుమస్ పుష్పలత వైకుంఠం తో పాటు గ్రామస్తులతో కలిసి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నరు అనంతరం ఆలయ కార్యనిర్వాహన అధికారి శ్రీనివాస్ స్వామివారి శేష వస్త్రంతో సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు అనంతరం తిమ్మాపూర్, మద్దునూర్ శివారులోని గండి హనుమాన్ దేవాలయం ను దర్శించుకున్న కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు చే ప్రత్యేక పూజలు జరిపించిన ఆలయ పూజారులు ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ మాజీ ఉపసర్పంచ్ బొడ్ల శ్రీనివాస్ భుజంగరావు అల్లం అనిల్ పోడేటి రవి సాయిని శ్రీనివాస్ కోరుట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆకుల లింగారెడ్డి ఆదిరెడ్డి కరుణాకర్ రావు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భక్తులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments