బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేస్తున్న
కనకదుర్గవైన్స్ షాప్ నిర్వాహకులు
పట్టించుకోనిఎక్సైజ్ శాఖ అధికారులు అధికారులు
తెలంగాణ కెరటం మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 12
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల
గ్రామీణ ప్రాంతాలలో ఏలాగైతే నిత్యవసర సరుకులైన పాలు,కూరగాయలు గ్రామాల్లో తీసుకెళ్లి అమ్ముకుంటున్నారో అలాగే మరిపెడ మండలంలోని కనకదుర్గవైన్స్ షాప్ నిర్వాహకులు కూడా నేరుగా టాటా ఏసీ ఆటోలు, బెల్ట్ షాపులకు మద్యాన్ని తరలించి సొమ్ము చేసుకుంటే,మాకేమి ఎరుగనట్టుగా ఎక్సైజ్ శాఖ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. గ్రామీణ,తండా లో బెల్ట్ షాపుల జోరుగా నడుస్తుంటే, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది మాకు ఏమి సంబంధం లేదనట్టుగా ఎక్సైజ్ శాఖ అధికారులు చూస్తూ ఊరుకుంటున్నారు.కానీ తండలలో ఇల్లులు తిరుగుతూ,వ్యవసాయ బావుల చుట్టూ తిరుగుతూ గుడుంబాన్ని పట్టుకొని కేసులు చేస్తున్న ఎక్సైజ్ శాఖ అధికారులు,మరి బహిరంగంగానే మద్యాన్ని తరలించి సొమ్ము చేసుకుంటున్న
వైన్ షాప్ నిర్వాహకులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో ప్రశ్నార్థకంగా మారింది. అద్దం షాపుల్లో మధ్య అమ్ముతున్న వారిపై కేసులు ఉండదా అనేదే అర్థమవుతుంది.ఎక్సైజ్ శాఖ వారు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే!

