Saturday, May 23, 2026
HomeUncategorizedఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం

ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం

📰 Generate e-Paper Clip

తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం నిండా మోసం చేసింది

బాల్కొండ నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకులు

తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి మార్చి 28 : 

నిజామాబాద్ జిల్లావేల్పూర్ మండల కేంద్రంలోని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నివాసం లో శనివారం రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ ల పేరుతో తెలంగాణ ప్రజలకు ఎన్నికల్లో హామీలు ఇచ్చి గడిచిన రెండు సంవత్సరాలుగా 6 గ్యారంటీ అమలుపరచకుండా తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలను మోసం చేసిందని బాల్కొండ నియోజకవర్గం టిఆర్ఎస్ నాయకులు విమర్శించారు

అసెంబ్లీ లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో 6 గ్యారంటీలో అమలు కోసం నిధులు కూడా కేటాయించకుండా ఇంకా కాంగ్రెస్ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తుంది అని విమర్శించారు.మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకొని గద్దె నెక్కింది అని అన్నారు మేము అధికారం లోకి వచ్చిన 100 రోజుల్లోనే హామీలన్ని అమలు చేస్తాం అని ఎన్నికల్లో ప్రతి వేదికలో చెప్పారు

ప్రజలను నమ్మించడానికి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనాడు గ్యారంటీ కార్డులను పంచి ప్రజలను మభ్యపెట్టింది కాంగ్రేస్ పార్టీ అధికారంలోకి వచ్చి 25 నెలలు కావస్తుంది కానీ ఏ ఒక్క హామీ కుడా సక్రమంగా అమలు చేయలేదు.పథకాల అమలు తక్కువ… ప్రచారం ఎక్కువ అన్న తీరున కాంగ్రెస్ పార్టీ పాలన సాగుతుంది

ఆరు గ్యారంటీల్లో భాగంగా

ప్రతి మహిళకు 2500 ఇస్తామని కాంగ్రెస్ హమీ ఇచ్చింది కానీ ఇప్పటి వరకు అమలు కాలేదు.

25 నెలలుగా 2500 చొప్పున 60 000 కాంగ్రెస్ ప్రతి మహిళకు బాకీ పడింది.ఈ బడ్జెట్ లో నిధులు కేటాయించలేదు వృద్దులకు, బీడీ పెన్షన్ వాళ్లకు అధికారం లోకి రాగానే 4000 పెన్షన్ చేస్తాం అన్నారు కానీ కేసీఆర్ ఇచ్చిన 2000 మాత్రమే ఇస్తున్నారు. ఈ బడ్జెట్ లో పెన్షన్ ల పెంపు ఊసే లేదని అన్నారు.

దివ్యంగులకు పెంచుతామన్న 6000 పెన్షన్ అమలకు బడ్జెట్ లో కేటాయింపులు లేవు.

రైతు భరోసా 15,000, కౌలు రైతులకు 15 వేలు, రుణమాఫీ కానీ వారికీ 2,00,000 రుణమాఫీ ఈ బడ్జెట్ లో ప్రస్థావించలేదు.

విద్యాభరోసా కార్డు 5,00,000 ఇస్తామన్నారు నిధుల కేటాయింపు లేదు.ఉపాధి హామీ కూలీలకు, ఆటో డ్రైవర్లకు సంవత్సరం కు 12,000 చొప్పున ఇస్తామని ఆరు గ్యారఆంటీల్లో చెప్పి బడ్జెట్ లో ఎలాంటి కేటాయింపులు చేయలేదు విద్యార్థులకు 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్,నిరుద్యోగ భృతి

విద్యార్థులకు స్కూటి లు, ఫీ రియంబర్స్మెంట్ లను విస్మరించింంది

ఇప్పటి వరకు పెళ్లిళ్లు అయినా ఆడబిడ్డలకు తులం బంగారం మాట బడ్జెట్ లో ఎత్తలేదు

ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఎన్నికల్లో ఆరు గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి బడ్జెట్ లో నిదులు కేటాయించకుండా ప్రజలను నమ్మించి మోసం చేసింది..

ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు అయ్యే వరకు ప్రజల పక్షాన బిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకు చేసిన మోసలను ప్రజాక్షేత్రం లో ఎండగడుతుంది.ఈ సమావేశంలో నాగంపేట్ శేఖర్ రెడ్డి,బద్దం ప్రవీణ్ రెడ్డి బాల్కొండ,కల్లెడ ఏలీయా, ప్రెసిడెంట్,దాసరి వెంకటేష్, రేగుంట దేవేందర్, జైడి నాగధర్,బద్దం రవి ,బద్దం నర్సారెడ్డి ,రేగుల్ల రాములు,దొంకంటి నర్సయ్య, చౌట్పల్లి రవి, ఆర్మూర్ మహేష,రాజా పూర్ణనందం,కొలిపాక ఉపేందర్,శ్రీకాంత్, గడ్డం స్వామి, ఏలేటి రమేష్,ప్రతాప్ ,భోజపల్లి సురేష్ లోలపు సుమన్,బూరుకల కమలాకర్ డోల్ల రాజేశ్వర్,గంగారెడ్డి నడ్కుడా, నారాయణ, గంగాధర్, సూర్జీల్, శ్రీనివాస్, శంకర్ గౌడ్, ఉమా శంకర్,ఆనంద్, యూసుఫ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments