ఈరెండు దశాబ్దాలుగా దగా చేస్తున్న ఆ రైస్ మిల్లర్ లీడర్…
అవినీతికి అంతం ఎప్పుడు..?
ఉమ్మడి మెదక్ ఆ జాయింట్ కలెక్టర్ – రైస్ మిల్లర్ లో భాగస్వామి
దస్తాలు మాయం చేసిండు…
కోట్లు సంపాదించిండు… ఏంజాయ్ చేసిండు…
పేరుకే రైస్ మిల్ వ్యాపారం… దోచుకునేది కోట్ల రూపాయలు ప్రశ్నించినందుకు రైస్ మిల్ పై విజిలెన్స్ కేసులు, పాడుపడేటట్టు చేసిండు
ఓ రైస్ మిల్లర్ కన్నీటి కథ… ఒక మచ్చుతునక….
తెలంగాణ కెరటం స్టేట్ బ్యూరో
ఆ రైస్ మిల్లర్ లీడర్ దశాబ్దం పాటు ఆడింది అటా.. పాడింది పాటా… ఐదు సంవత్సరాలుగా జేసి గా పనిచేసి మెదక్ ఉమ్మడి జిల్లా కలెక్టర్ గా పనిచేసిన ఆ ఉన్నతాధికారిని లోబర్చుకోని కోట్ల రూపాయలు పంచుకున్నరు… ఆ జాయింట్ కలెక్టర్ కు వ్యాపారంలో భాగస్వామి చేసిండు. పెద్దపెద్ద గోదాములు, పాట్నర్‌షిప్ ఇచ్చాడు. హైద్రాబాద్ వద్ద మరో గోదాములో పాట్నర్‌షిప్, దాదాపు ఆ జాయింట్ కలెక్టర్ వంద కోట్ల రూపాయలు స్వాహా చేసిందు అని, అతన్ని ప్రశ్నిస్తే రైస్ మిల్లర్ లకు ఊహించని రీతిలో కష్టం వచ్చి పడుతుంది. తప్పించుకోవడానికి వీలులేకుండా ఫిక్స్ చేస్తారు. చెప్పినట్లు చేయాల్సిందేనని లేదంటే తిప్పలు తప్పవని మధ్యవర్తి ద్వారా హుకుం జారీ చేస్తారు. ఏదైనా కిరికిరి చేస్తే నష్టపోయేది మీరేనంటు హెచ్చరిస్తారు. ఈ క్రమంలో ఏం చేయాలో తోచక వారు అడిగింది అడిగినట్లు ముట్ట కొన్ని. చెప్పాల్సిందే. సీజన్ లాగా రైతుల నుండి సేకరించే ధాన్యాన్ని ప్రభుత్వం రైస్ మిల్ కు పంపి (సిఎంఆర్-కస్టం మిల్డ్ రైస్) బియ్యంగా మార్చి తీసుకోని పౌరసరఫరా శాఖ ద్వారా పేదల కు పంపిణీ చేస్తుంది. ఈ క్రమంలో రైస్ మిల్లర్ లకు క్వింటా ళ్లుకు డబ్బు చెల్లిస్తుంది. డబ్బు ఇచ్చినప్పుడు మాముళ్ళు ఇచ్చే లా రేటు ఫిక్స్ చేసింది. గత ఏడాది బిల్లుల మంజూరు కోసం ముడుపులను అధికారులకు చెల్లించాల్సిందే. సిఎంఆర్ అను మతి కోసం మిల్లర్ లు పెద్ద మొత్తంలో దబ్బులు చెల్లించాల్సి ౦దే. ప్రతి సంవత్సరం బిల్లుల కోసం ఆ లీడర్ చుట్టూ తిరగా ల్సిందే, ఉమ్మడి మెదక్ జిల్లా ఉన్నప్పటి నుండి మొదలుకొని ప్రత్యేక జిల్లాగా అయినప్పటి వరకు దాదాపు రెండు దశాబ్దా లుగా ఆ రైస్ మిల్లర్ ల నాయకుడిగా మొత్తం వ్యవహారాన్ని గుట్టుచప్పుడు కాకుండా చక్కబెడుతున్నట్టు నటించి అధికారు లకు చారాణ ఇచ్చి బారాణ మింగుడు కాదు… ఏకంగా అధి కారులకు చారాణ కూడా ఇవ్వడు… పది పైసలు ఇచ్చి
ఎంత సేవ చేసిన కనికరించదు…
చివరికి నా రైస్ మిల్ పై మూడు సార్లు విజిలెన్స్ రైడ్ చేయించినఘనుడు… ఆ రైస్ మిల్లర్ లీడర్ పేరా మూడు రాత్రులు పోలీస్ స్టేషన్ లో పడుకున్నా చివరికి అతన్ని బావా… ఒక కంపెనీ ముద్రను ఫోర్జరీ చేసి వస్తువులను అమ్ముతుంటే రైడ్ చేసి పట్టుకున్న సందర్భంలో కూడా నేను అండగా ఉన్నా. కాని ఆయనకు ఏ అన్యాయం చేయకున్నా నా పారాబాయిల్డ్ రైస్ మిల్‌పై అతని కనుసైగల్లోనే మూడు సార్లు విజిలెన్స్ రైడ్ చేశారు. ఆ రైస్ మిల్ లో ఏమిలేదన్నా కూడా జాయింట్ కలెక్టర్ తో ఒత్తిడి చేయించి మానసిక క్షోభకు గురిచేసిండు. పాట్నర్ ల మధ్య విభేదాలు సృష్టిస్తాడు. కోట్ల రూపాయలు దండు కోవడంలో ఆయనకు రారు సాటి మరెవరు అని అన్నారు.
వెయ్యి పేజీల అక్రమ రికార్డు నా దగ్గర ఉంది…?
ఆ నాయకుడు, జాయింట్ కలెక్టర్, అతని పాట్నర్ ఓ పటేల్ అక్రమంగా దండుకొని కోట్లు గడించిన రికార్డులు అన్ని నా వద్ద ఉన్నాయని, అధికారికంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆ జాయింట్ కలెక్టర్ ను అద్దుపెట్టుకోని మూడు సంవత్సరాల రికార్డులు తగల బెట్టారని, అది మొత్తం ఒక పెద్ద కుంబకోణం అని ఆ మూడు రైస్ మిల్లర్ ల యాజమాని వాపోయాడు. ఆ లీడర్ పై అనేక మంది ఫిర్యాదు లు చేశారు. ఆ రైస్ మిల్లర్ లీడర్ అవినీతి అంతా ఇంతా కాదు. అనేక మంది మెతుకుసీమ టైమ్స్ కు జిల్లా నలుమూ లల నుండి మాట్లాడుతూ ఒక్కసారి వచ్చి మీకు కలుస్తాం. వివరాలను వెల్లడిస్తాం అని సామాన్యుల నుండి మొదలుకొని పెద్ద రైస్ మిల్లర్ ల వరకు ఫోన్ లు చేయడం విశేషం. దీయచేసి మీ కాళ్ళు మ్రొక్కుతాం… దండం పెడతాం… ఆ దుర్మార్గాన్ని, కుంభకోణాన్ని ప్రపంచానికి తెలియజేయాలని” ప్రాధేయ పడుతున్న తీరు చూస్తే ఆశ్చర్యం కల్గిస్తా

