Saturday, May 23, 2026
HomeUncategorizedరామాయంపేట స్నేహ కళాశాల విద్యార్థుల ప్రభంజనం

రామాయంపేట స్నేహ కళాశాల విద్యార్థుల ప్రభంజనం

📰 Generate e-Paper Clip

ఎంపీసీ రెండవ సంవత్సరం విద్యార్థి రాష్ట్రస్థాయి లో ఒకరు. ఫస్ట్ ఇయర్లో ఎంపీసీ ఒకరు, బైపిసి లో ఒకరు రాష్ట్రస్థాయి మార్కులు సాధించారు. స్నేహ కళాశాలల కరస్పాండెంట్ వెలిశెట్టి సత్యనారాయణ వెల్లడి.

తెలంగాణ కెరటం మెదక్ జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 12:

సెకండ్ ఇయర్ ఎంపీసీ లో ఈ వృత్తివి శ్రీ 990/1000 మార్కులు సాధించి స్టేట్ ఏడవ ర్యాంకు సంపాదించింది. ఫస్ట్ ఇయర్ లో ఎంపీసీలో ఏ.లోకేష్ 466/470 మార్కులు సాధించి రాష్ట్రంలో నాలుగో స్థానంలో నిలిచాడు. బైపీసీ మొదటి సంవత్సరంలో బి.స్పందన 434/400 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో నాలుగవ స్థానం దక్కించుకుంది.ఇంటర్ 2026 ఫలితాల్లో మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని స్నేహ జూనియర్ కళాశాల రామాయంపేట విద్యార్థుల ప్రభంజనం.ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్రస్థాయి ఫలితాలు సాధించిన విద్యార్థులు స్నేహ కళాశాలల కరస్పాండెంట్ వెలిశెట్టి సత్యనారాయణ వెల్లడి.ఈ సందర్భంగా ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ డివిజన్ ఆరు గ్రూప్ లలో,రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన ఏకైక కళాశాల స్నేహ కళాశాల అని కళాశాల కరస్పాండెంట్ వెలిశెట్టి సత్యనారాయణ పేర్కొన్నారు.ఆరు గ్రూపులో గాను ఆరు గ్రూపుల్లో రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి మార్కులు సాధించడం సాధించడం జరిగిందని కళాశాల కరస్పాండెంట్ వెలిశెట్టి సత్యనారాయణ తెలిపారు. మార్కులు సాధించిన విద్యార్థులకు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, జిల్లా కలెక్టర్ ప్రతిమసింగ్, జిల్లా విద్యాధికారి తో పాటు రామాయంపేట మున్సిపల్ చైర్మన్ గజవాడ లావణ్య నాగరాజు,కౌన్సిలర్లు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు,విద్యార్థులు తల్లిదండ్రులు అభినందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments