Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

దేశంలో పేదవాళ్లకు భూములు పంచిన ఘనత ఇందిరాగాంధీ ది

Author
Posted By TELANGANA KERATAM
| 01 Nov 2026, 08:12 AM | 7 | INTERNATIONAL
దేశంలో పేదవాళ్లకు భూములు పంచిన ఘనత ఇందిరాగాంధీ ది

దేశంలో పేదవాళ్లకు భూములు పంచిన ఘనత ఇందిరాగాంధీ ది
తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 31, అక్టోబర్
దేశ ప్రజల భద్రత కోసం క్లిష్ట పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయం వల్ల ఆమె తూటాలకు బలయ్యారు
ఇందిరమ్మ ఇచ్చిన భూములే నేటికి పేదలకు జీవనాధారం గా ఉన్నాయి
భూపంపిణీతో పేదల జీవితాల్లో వెలుగులు నింపారు
ఓడీఎఫ్, బీడీఎల్, ఇక్రిశాట్ లాంటి గొప్ప సంస్థలను ఏర్పాటు చేసి సంగారెడ్డి జిల్లా అభివృద్ధి కి బాటలు వేశారు
మెదక్ ఎంపీ గా ప్రధాన మంత్రి హోదాలో ఈ ప్రాంతానికి విశేష సేవలందించారుఇందిరా గాంధీ బాటలోనే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నడుస్తున్నారు
సంగారెడ్డి లో ఇందిరాగాంధీ వర్ధంతి కార్యక్రమంలో జగ్గారెడ్డి ఇందిరాగాంధీ హయాంలో పేదలకు పంపిణీ చేసిన భూములే నేటికీ అనేక కుటుంబాలకు జీవనాధారంగా నిలుస్తున్నాయని జగ్గారెడ్డి అన్నారు. ఆ భూములను సాగుచేసుకుంటూ పేదలు జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు. ఇందిరాగాంధీ 42వ వర్ధంతి సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని ఐబీ చౌరస్తా వద్ద ఆమెకు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. పేదలకు భూములు అందించి, వారికి ఆర్థిక భరోసా కల్పించడంలో ఇందిరాగాంధీది చారిత్రక పాత్ర అని కొనియాడారు. భూమిని పేద కుటుంబాల బతుకుదెరువుకు ఆధారంగా మార్చిన ఆమె కృషి మరువలేనిదన్నారు. బ్యాంకుల జాతీయీకరణతో సామాన్య ప్రజలకు బ్యాంకింగ్ సేవలను చేరువ చేశారని గుర్తుచేశారు.మెదక్ ఎంపీగా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన ఇందిరాగాంధీకి సంగారెడ్డితో ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. సంగారెడ్డిలో ఆమె పాల్గొన్న రెండు సభలను గుర్తుచేశారు. ప్రధాని హోదాలో జిల్లా పరిషత్ సమావేశంలోనూ పాల్గొన్నారని తెలిపారు. ఈ ప్రాంతంలో ఓడీఎఫ్‌తోపాటు బీడీఎల్ పరిశ్రమల ఏర్పాటుకు ఆమె చేసిన కృషిని ప్రస్తావించారు.
దేశ భద్రత కోసం క్లిష్టమైన నిర్ణయాలు తీసుకున్న ఇందిరాగాంధీ 1984లో తూటాలకు బలయ్యారని అన్నారు. జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ పాలన దేశ పారిశ్రామిక, ఆర్థికాభివృద్ధికి పునాదులు వేసిందని పేర్కొన్నారు. దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబం నుంచి వచ్చిన రాహుల్‌గాంధీ, తన నానమ్మ ఇందిరాగాంధీ ఆశయాల బాటలో ప్రజల కోసం పనిచేస్తున్నారని జగ్గారెడ్డి అన్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: