తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, అక్టోబర్ 31 : సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని భారత్ సురక్ష సమితి జగిత్యాల జిల్లా శాఖ, రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ ఏసీఎస్ రాజు ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని కొత్త బస్టాండ్ చౌరస్తాలోని పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సమితి నాయకులు ఏసిఎస్ రాజు, అక్కినపల్లి కాశీనాథం, సమరసత వేదిక కరీంనగర్ విభాగ్ సంయోజక్ చిట్ల గంగాధర్ లు మాట్లాడుతూ.. స్వతంత్ర భారతదేశనికి మొదటి ఉప ప్రధానిగా, హోం మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడని, దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత భౌగోళికంగా భారతదేశం ముక్కలు కాకుండా ఒక్కటి చేసిన మహనీయుడని కీర్తించారు. మనకు స్వాతంత్రం వచ్చేనాటికి దేశంలో ఉన్న 565 కు పైగా స్వదేశీ సంస్థానాలను ఇండియన్ యూనియన్ లో విలీనం చేసి, అఖండ భారత దేశానికి పునాదులు వేసిన మహనీయుడని, ఉక్కుమనిషి ఇండియన్ బిస్మార్క్ గా ప్రసిద్ధి చెందాడని అన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ సంస్థానంలో భాగంగా ఉన్న మన తెలంగాణకు నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి కల్పించాడని, తెలంగాణలో ప్రజలు నిజాం పాలనలో బానిసల్లాగా బ్రతుకుతూ అనేక చిత్రహింసలకు గురయ్యారని, స్త్రీల మానప్రాణాలకు రక్షణ లేని పరిస్థితులు ఉండేవని ఇలాంటి రాక్షస, అరాచక పరిపాల నుండి 1948 సెప్టెంబర్ 17,న మనకు విముక్తి కల్పించే స్వేచ్ఛ వాయువుల్ని పీల్చుకునే స్వాతంత్రాన్ని ప్రసాదించిన గొప్ప వ్యక్తిని ఇలాంటి స్వాతంత్రోద్యమ మహనీయుల యొక్క జయంతి, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించడం మన బాధ్యత అని అన్నారు. ఆయన చేసిన సేవలకు గుర్తుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పేరుతో ప్రపంచంలోనే అతి ఎత్తైన ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసిందని, ఇతని పుట్టినరోజును జాతీయ ఐక్యత దినంగా జరుపుకుంటారని దేశం కోసం త్యాగాలు చేసిన ఇలాంటి నాయకుల జీవితాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సింగం గంగాధర్, 22,వ వార్డు కౌన్సిలర్ ఆరవ లక్ష్మి, కొత్తకొండ బాలన్న గాదాసు భూమన్న నరేందుల శ్రీనివాస్ ఎడమల వెంకట్ రెడ్డి, చిలుక రాజన్న, వంగల భాస్కర్, ఇల్లెందుల పురుషోత్తం, గండ్ర ప్రవీణ్ రావు, కొక్కిరాల గోపాల రావు, ఆడెపు జానయ్య, సిరిపురం గంగారం, నాయిని సంజీవరావు, బండి సత్యం, దొనకంటి జనార్దన్ రెడ్డి, పెండెం గంగాధర్ లు పాల్గొన్నారు.
భారత్ సురక్షా సమితి ఆధ్వర్యంలో వల్లభాయ్ పటేల్ కు ఘన నివాళులు
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి
తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags:
మద్దూరులో పోలీసుల మెరుపు దాడులు
కామారెడ్డిలో 'వసూల్ రాజా'.. మున్సిపల్ తో పాటు పోలీస్ కేసుల్లోనూ సెటిల్మెంట్లు?
ప్రమాదాలు జరగకుండా వ్యవసాయ బావుల చుట్టూ రక్షణ గోడలు నిర్మించేందుకు నిధులు మంజూరు
శెట్పల్లి గ్రామంలో రైతులకు పంటల సాగు పై అవగాహన కార్యక్రమం
నాడు కాంగ్రెస్ హయాంలో SIR (సర్).. నేడు అదే విధానంపై వ్యతిరేక స్వరం.
