ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి..!బిజేవైయం కోరుట్ల పట్టణ అధ్యక్షుడు దమ్మ సంతోష్ రెడ్డి తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, అక్టోబర్ 31 : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వరి పంట కోతలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో.. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని బీజేపీ యువమోర్చా కోరుట్ల పట్టణ అధ్యక్షుడు దమ్మ సంతోష్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా శనివారం ఆయన మాట్లాడుతూ..రైతులు దళారులను నమ్మి తమ కష్టార్జిత ధాన్యాన్ని తక్కువ ధరలకు విక్రయించి నష్టపోవద్దని సూచించారు. రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వ మద్దతు ధరకు విక్రయించి, మంచి లాభాలు పొందేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు వరి ధాన్యంపై ప్రకటించిన బోనస్‌తో పాటు కనీస మద్దతు ధరను రైతులకు అందించాలని కోరారు. రైతులు పండించిన ధాన్యాన్ని నిల్వ చేసుకునే పరిస్థితులు లేక ఇబ్బందులు పడకుండా, ప్రభుత్వం వెంటనే స్పందించి రాష్ట్రవ్యాప్తంగా అవసరమైన చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలను యుద్ధప్రాతిపదికన ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి జాప్యం లేకుండా ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేసి, రైతులకు చెల్లింపులు కూడా త్వరగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల ప్రయోజనాలను కాపాడాలని కోరారు.
ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి
తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags:
మద్దూరులో పోలీసుల మెరుపు దాడులు
కామారెడ్డిలో 'వసూల్ రాజా'.. మున్సిపల్ తో పాటు పోలీస్ కేసుల్లోనూ సెటిల్మెంట్లు?
ప్రమాదాలు జరగకుండా వ్యవసాయ బావుల చుట్టూ రక్షణ గోడలు నిర్మించేందుకు నిధులు మంజూరు
శెట్పల్లి గ్రామంలో రైతులకు పంటల సాగు పై అవగాహన కార్యక్రమం
నాడు కాంగ్రెస్ హయాంలో SIR (సర్).. నేడు అదే విధానంపై వ్యతిరేక స్వరం.
