నేషనల్ హైవే అంశంలో రైతులను అడ్డుపెట్టుకొని రఘునాథ్ రావుపై బురదజల్లడం మానుకోవాలి......
బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కస్తూరి నాగరాజు......
తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు మంచిర్యాల జిల్లా..
బీఆర్ఎస్ అంటేనే అవినీతి.. బీజేపీపై అవినీతి ఆరోపణలు చేస్తే ప్రజలు నవ్వుకుంటారు.
నేషనల్ హైవే అంశంలో రైతులను అడ్డుపెట్టుకొని బీజేపీ నాయకుడు రఘునాథ్ రావు గారిపై కొంతమంది దళారులు ఉద్దేశపూర్వకంగా విమర్శలు చేయించడం మానుకోవాలని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కస్తూరి నాగరాజు హితవు పలికారు. శనివారం మంచిర్యాల భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.రైతుల సమస్యల పరిష్కారానికి రఘునాథ్ రావు కృషి..హాజీపూర్, లక్సెట్టిపేట మండలాలతో పాటు ఇతర ప్రాంతాల రైతుల సమస్యల పరిష్కారం కోసం రఘునాథ్ రావు కేంద్ర మంత్రులను, నేషనల్ హైవే రీజినల్ అధికారులను కలిసి సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు.ఈ విషయానికి సంబంధించిన ఫోటోలు, లేఖలు, తేదీలతో కూడిన ఆధారాలు ఫేస్బుక్, ఇతర సోషల్ మీడియా వేదికల్లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.వాటికి సంబంధించిన స్క్రీన్షాట్లను మీడియా ముందు ఉంచినట్లు వెల్లడించారు.రైతులు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొంతమంది దళారుల చేతిలో పావులుగా మారవద్దని, రఘునాథ్ రావును బద్నాం చేసే ప్రయత్నాలను మానుకోవాలని కోరారు.
బీజేపీపై అవినీతి ఆరోపణలు చేయడం విడ్డూరంగాఉందని,
మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం పెనాయిల్, ఎల్ఈడీ లైట్ల కొనుగోళ్లలో స్కాం చేసిందంటూ బీఆర్ఎస్ నాయకుడు ఒకరు చేసిన ఆరోపణలను కస్తూరి నాగరాజు ఖండించారు.
మధ్యప్రదేశ్లో గత 21 సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉందని తెలిపారు.
ఈ కాలంలో ప్రవేశపెట్టిన మొత్తం బడ్జెట్ సుమారు రూ.25 లక్షల కోట్లుగా ఉందని పేర్కొన్నారు.
పెనాయిల్కు సంబంధించి రూ.33,000, ఎల్ఈడీ బల్బులకు సంబంధించి రూ.11,800 స్కాం జరిగిందని ఆరోపించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో వేల కోట్ల రూపాయల స్కాంలు జరిగాయని, కాగ్ నివేదికలు సైతం ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలపై పలు అంశాలను వెల్లడించాయని అన్నారు.బీఆర్ఎస్ నాయకులకు అవినీతి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదుని, బీఆర్ఎస్ అంటేనే అవినీతి, అవినీతి అంటేనే బీఆర్ఎస్ అని కస్తూరి నాగరాజు ఘాటుగా విమర్శించారు. బీజేపీపై ఆధారాలు లేని ఆరోపణలు చేయడం మానుకోవాలని, అలాంటి ఆరోపణలు చేస్తే ప్రజలు నవ్వుకుంటారని అన్నారు.
ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధులు కస్తూరి నాగరాజు, రాకేష్ రెన్వా, బీజేపీ జోనల్ అధ్యక్షుడు అమెరిశెట్టి రాజు, మున్సిపల్ కార్పొరేషన్ కన్వీనర్ బొట్ల సత్యం తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
నేషనల్ హైవే అంశంలో రైతులను అడ్డుపెట్టుకొని రఘునాథ్ రావుపై బురదజల్లడం మానుకోవాలి......
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి
తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags:
మద్దూరులో పోలీసుల మెరుపు దాడులు
కామారెడ్డిలో 'వసూల్ రాజా'.. మున్సిపల్ తో పాటు పోలీస్ కేసుల్లోనూ సెటిల్మెంట్లు?
ప్రమాదాలు జరగకుండా వ్యవసాయ బావుల చుట్టూ రక్షణ గోడలు నిర్మించేందుకు నిధులు మంజూరు
శెట్పల్లి గ్రామంలో రైతులకు పంటల సాగు పై అవగాహన కార్యక్రమం
నాడు కాంగ్రెస్ హయాంలో SIR (సర్).. నేడు అదే విధానంపై వ్యతిరేక స్వరం.
