Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవనంపై నిషేధాజ్ఞల కొనసాగింపు

Author
Posted By TELANGANA KERATAM
| 01 Nov 2026, 01:05 PM | 10 |
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవనంపై నిషేధాజ్ఞల కొనసాగింపు

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవనంపై నిషేధాజ్ఞల కొనసాగింపు అనుమతి లేకుండా డ్రోన్ల వినియోగం, డీజే సౌండ్స్‌పై కఠిన చర్యలు

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా....

తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు.....

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రజల శాంతిభద్రతలు, భద్రత మరియు సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, అనుమతి లేకుండా డీజే సౌండ్స్ వినియోగించడం, డ్రోన్లను ఉపయోగించడం, అలాగే అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించడంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను కొనసాగిస్తున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు.

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై నిషేధం

సాధారణ ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మంచిర్యాల, పెద్దపల్లి జోన్‌ల పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై నిషేధాజ్ఞలను కొనసాగించినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు.
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి కొందరు వ్యక్తులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు. మద్యం మత్తులో వీధులు, రహదారులపై అసభ్యకరంగా ప్రవర్తించడం, ప్రజలకు ఇబ్బందులు కలిగించడం, మహిళలు మరియు ఇతర వర్గాల ప్రజలకు అసౌకర్యం కలిగించడం వంటి ఘటనలను నివారించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ఈ నిషేధాజ్ఞలు 01-11-2026 నుండి 01-12-2026 వరకు అమల్లో ఉంటాయని తెలిపారు. అవసరాన్ని బట్టి నిషేధాజ్ఞల కాలపరిమితిని పొడిగించే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.
నిషేధాజ్ఞలను ఉల్లంఘించే వారిపై భారతీయ న్యాయ సంహిత (బి.ఎన్.ఎస్ ) సెక్షన్ 223, హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్, 1348 ఫసలీ నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.
డీజే సౌండ్స్ వినియోగంపై నిషేధాజ్ఞల కొనసాగింపు
ప్రజలకు శబ్ద కాలుష్యం వల్ల కలిగే ఇబ్బందులను నివారించేందుకు మంచిర్యాల, పెద్దపల్లి జోన్‌ల పరిధిలో అధిక శబ్దంతో డీజే సౌండ్స్ వినియోగంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను కూడా కొనసాగించినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు.
డీజే సౌండ్స్ కారణంగా చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు, విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని తెలిపారు. విద్యార్థుల చదువుకు,ప్రజల ప్రశాంత జీవనానికి భంగం కలగకుండా శబ్ద కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ప్రజలను సమీకరించే కార్యక్రమాలు,ఇతర వేడుకల సందర్భంగా డీజే సౌండ్స్‌ను అధిక శబ్దంతో వినియోగించడం పూర్తిగా నిషేధమని తెలిపారు. కార్యక్రమాల నిర్వహణకు మైక్ సెట్ అవసరమైతే, సంబంధిత డివిజన్ ఏసీపీ నుండి ముందస్తు అనుమతి తప్పనిసరిగా పొందాలని సూచించారు. మైక్ సెట్ వినియోగానికి సంబంధించి నిర్దేశించిన నిబంధనలు,శబ్ద పరిమితులను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.డీజే సౌండ్స్‌కు సంబంధించిన నిషేధాజ్ఞలు కూడా 01-11-2026 నుండి 01-12-2026 వరకు అమల్లో ఉంటాయని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై బి.ఎన్.ఎస్ సెక్షన్ 223, హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్, 1348 ఫసలీ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అనుమతి లేకుండా డ్రోన్ల వినియోగంపై చర్యలు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా డ్రోన్లను వినియోగించరాదని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు.
ప్రజా భద్రత, శాంతిభద్రతలు మరియు ముఖ్యమైన ప్రదేశాల భద్రతను దృష్టిలో ఉంచుకుని డ్రోన్ల వినియోగంపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని తెలిపారు.ఎలాంటి కార్యక్రమం,వేడుక లేదా ఇతర అవసరాల కోసం డ్రోన్ వినియోగించాలన్నా సంబంధిత పోలీస్ అధికారుల నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలని సూచించారు.
అనుమతి లేకుండా డ్రోన్లను వినియోగించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్‌లలో రామగుండం పోలీస్ కమిషనరేట్ యాక్ట్–2016లోని సెక్షన్ 7(1), సెక్షన్ 22(1)(a) నుండి (f), సెక్షన్ 22(2)(a), (b), సెక్షన్ 22(3), సిటీ పోలీస్ యాక్ట్, 1348 ఫసలీ నం. IX సెక్షన్ 30 మరియు పోలీస్ యాక్ట్–1861 నిబంధనల ప్రకారం నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని పోలీస్ కమిషనర్ తెలిపారు.
ఈ నిషేధాజ్ఞలు 01-11-2026 ఉదయం 6.00 గంటల నుండి 01-12-2026 ఉదయం 6.00 గంటల వరకు అమల్లో ఉంటాయని తెలిపారు.
ఈ కాలంలో సంబంధిత పోలీస్ అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, బహిరంగ సభలు, సమావేశాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు.
బంద్‌లు, నిరసనల పేరుతో బలవంతపు చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు
బంద్‌లు లేదా ఇతర నిరసన కార్యక్రమాల పేరుతో సంస్థలు, వ్యాపార సముదాయాలు, కార్యాలయాలను బలవంతంగా మూసివేయించడం, ప్రజలను విధులకు హాజరు కాకుండా అడ్డుకోవడం, వ్యాపారులను లేదా ఇతర వ్యక్తులను బెదిరించడం,ఒత్తిడి చేయడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.
ప్రజల స్వేచ్ఛకు, సాధారణ కార్యకలాపాలకు మరియు శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు.
ప్రజలకు పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతియుత వాతావరణాన్ని కొనసాగించేందుకు ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కోరారు.ప్రజలు నిషేధాజ్ఞలను పాటించాలని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, అనుమతి లేకుండా డీజే సౌండ్స్ లేదా డ్రోన్లను వినియోగించడం, అలాగే ముందస్తు అనుమతి లేకుండా నిరసన కార్యక్రమాలు నిర్వహించడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు.ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై ఎలాంటి మినహాయింపు లేకుండా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: