Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

సీతారాంపల్లిలో ఘనంగా భూలక్ష్మి, మహాలక్ష్మి, పోచమ్మ తల్లుల కొలుపు ఉత్సవాలు..

Author
Posted By TELANGANA KERATAM
| 01 Nov 2026, 01:09 PM | 8 | TELANGANA
సీతారాంపల్లిలో ఘనంగా భూలక్ష్మి, మహాలక్ష్మి, పోచమ్మ తల్లుల కొలుపు ఉత్సవాలు..
  • ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు , మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ దంపతులు.
తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు.మంచిర్యాల జిల్లా.. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 09వ డివిజన్ సీతారాంపల్లి గ్రామంలో నిర్వహించిన భూలక్ష్మి, మహాలక్ష్మి, పోచమ్మ దేవతల కొలుపు ఉత్సవాల్లో మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు , మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పాల్గొని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ భూలక్ష్మి, మహాలక్ష్మి, పోచమ్మ తల్లుల ఆశీస్సులతో సీతారాంపల్లి గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, గ్రామంపై అమ్మవార్ల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల మధ్య ఐక్యతను, భక్తిభావాన్ని పెంపొందించడంతో పాటు మన పూర్వీకుల సంప్రదాయాలను, సంస్కృతిని భావితరాలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు.అనంతరం గ్రామస్తులు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు దంపతులను శాలువాతో సత్కరించారు..ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ , స్థానిక కార్పొరేటర్ సురిమిల్ల సౌమ్య , గ్రామ పెద్దలు, ప్రజలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు..

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: