రక్తదానం చేయండి... ప్రాణదాతలుగా నిలవండి: మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్
తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు
మంచిర్యాల జిల్లా....పోలీసు అమరవీరుల స్ఫూర్తితో ప్రజాసేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్ తెలిపారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మంచిర్యాల పోలీసుల ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని ఎన్ కన్వెన్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని డీసీపీ శనివారం ప్రారంభించారు.ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ పోలీసు అమరవీరులు ప్రజల హక్కుల పరిరక్షణతో పాటు ప్రజల ధన, మాన,ప్రాణాల రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారని తెలిపారు.వారి త్యాగాలను స్మరించుకుంటూ, వారి ఆశయాలకు అనుగుణంగా మరింత అంకితభావంతో ప్రజలకు సేవలందించాలనే ఉద్దేశంతో సంస్మరణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.ప్రజల ప్రాణాలను కాపాడేందుకు పోలీసు అమరవీరులు తమ ప్రాణాలను అర్పించినట్లే, ఆపదలో ఉన్న వారి ప్రాణాలను రక్షించడంలో రక్తదానం కూడా కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. రోడ్డు ప్రమాదాలు, అత్యవసర వైద్య పరిస్థితులు, క్లిష్టమైన శస్త్రచికిత్సల సమయంలో రక్తం ఎంతో అవసరమని, ఒకరు చేసే రక్తదానం మరొకరి ప్రాణాలను కాపాడే ప్రాణదానంగా మారుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల పోలీసు సిబ్బందితో పాటు యువత, ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమని డీసీపీ పేర్కొన్నారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.అవసరమైన వారికి సకాలంలో రక్తాన్ని అందించడంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని అన్నారు.పోలీసు శాఖతో సమన్వయంతో రెడ్‌క్రాస్ సొసైటీ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతోమంది ప్రాణాలను కాపాడేందుకు దోహదపడుతున్నాయని తెలిపారు.మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాష్, మంచిర్యాల పట్టణ ఇన్‌స్పెక్టర్ ప్రమోదరావు, రెడ్‌క్రాస్ సొసైటీ బాధ్యులు డాక్టర్ రెడ్డి,మహేందర్‌తో పాటు సహకరించిన ప్రతి ఒక్కరికీ డీసీపీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాష్, మంచిర్యాల పట్టణ ఇన్‌స్పెక్టర్ ప్రమోదరావు, ఎస్‌ఐలు,మంచిర్యాల రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ జై భాస్కర్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ సిహెచ్ మహేందర్,సీనియర్ మెంబర్ వి మధుసూదన్ రెడ్డి, లైన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల ప్రెసిడెంట్ పి వెంకటేశ్వర్లు, ట్రెజరర్ ఏవి రావు, లయన్ డాక్టర్ కే సుగుణాకర్ రెడ్డి, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రక్తదానం చేయండి... ప్రాణదాతలుగా నిలవండి: మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి
తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags:
మద్దూరులో పోలీసుల మెరుపు దాడులు
కామారెడ్డిలో 'వసూల్ రాజా'.. మున్సిపల్ తో పాటు పోలీస్ కేసుల్లోనూ సెటిల్మెంట్లు?
ప్రమాదాలు జరగకుండా వ్యవసాయ బావుల చుట్టూ రక్షణ గోడలు నిర్మించేందుకు నిధులు మంజూరు
శెట్పల్లి గ్రామంలో రైతులకు పంటల సాగు పై అవగాహన కార్యక్రమం
నాడు కాంగ్రెస్ హయాంలో SIR (సర్).. నేడు అదే విధానంపై వ్యతిరేక స్వరం.
