ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కథలాపూర్ మండలం బొమ్మెన గ్రామంలో నివసిస్తున్న పెద్దకాపు అశోక్, తండ్రి అప్పారావు శనివారం రోజున మధ్యాహ్నం సుమారు 3:20 గంటల సమయంలో తన ద్విచక్ర వాహనంపై బొమ్మెన గ్రామం నుండి మోత్కూరావుపేటకు పని నిమిత్తం వెళ్తుండగా, గంభీర్‌పూర్ గ్రామ శివారులో ఎదురుగా వస్తున్న టాటా ఇంట్రా వాహనాన్ని దాని డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా నడపడం వల్ల, అట్టి వాహనానికి వెనుక భాగంలో అమర్చిన కాంక్రీట్ మిల్లర్ ఊడిపోయి పెద్దకాపు అశోక్ కు బలంగా తగలడంతో అతడి తలకు, ఇతర శరీర భాగాలకు తీవ్ర గాయాలు కాగా, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అజాగ్రత్తగా వాహనాన్ని నడిపి ప్రమాదానికి కారణమైన డ్రైవర్ సలంగన మాలకొండయ్యపై మృతుడి తండ్రి పెద్దకాపు అప్పారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు కథలాపూర్ ఎస్సై రవికిరణ్ తెలిపారు.
గంభీర్ పూర్ శివారులో రోడ్డు ప్రమాదం..వ్యక్తి మృతి
కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 01 :
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి
తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags:
మద్దూరులో పోలీసుల మెరుపు దాడులు
కామారెడ్డిలో 'వసూల్ రాజా'.. మున్సిపల్ తో పాటు పోలీస్ కేసుల్లోనూ సెటిల్మెంట్లు?
ప్రమాదాలు జరగకుండా వ్యవసాయ బావుల చుట్టూ రక్షణ గోడలు నిర్మించేందుకు నిధులు మంజూరు
శెట్పల్లి గ్రామంలో రైతులకు పంటల సాగు పై అవగాహన కార్యక్రమం
నాడు కాంగ్రెస్ హయాంలో SIR (సర్).. నేడు అదే విధానంపై వ్యతిరేక స్వరం.



