కెరటం కొడంగల్ నియోజకవర్గ ప్రజా ప్రతినిధి నవంబర్ 1
పెద్దాపూర్ వాగు నుంచి అర్ధరాత్రి ఇసుక తరలింపు.. ట్రాక్టర్ స్వాధీనం
కొత్తపల్లి మండలం పెద్దాపూర్ వాగు నుంచి అర్ధరాత్రి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో భవాని అంబేద్కర్‌కు చెందిన ట్రాక్టర్ (నంబర్ TS06UD6277)ను పోలీసులు పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం ట్రాక్టర్ యజమానిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. అర్ధరాత్రి వేళ వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని మద్దూర్ ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు....
