తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 1, నవంబర్
ఓటర్ల తొలగింపుపై ఢిల్లీ పీఠం దద్దరిల్లేలా కాంగ్రెస్ గళం
ఎస్ ఐ ఆర,లో జరిగిన అవకతవకలపై, ‘ఓట్ బచావ్ - దేశ్ బచావ్’ అనే నినాదంతో ఏఐసీసీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని రామ్ లీలా మైదాన్లో నిర్వహించిన భారీ నిరసన ర్యాలీకి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు.
ఓటర్ల హక్కులను కాలరాస్తున్న అక్రమాలపై కాంగ్రెస్ శ్రేణులతో కలిసి గళమెత్తారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
