Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కాచెరువు శిఖం భూమిని కాపాడాలి

Author
Posted By TELANGANA KERATAM
| 02 Nov 2026, 08:30 PM | 3 | Politics, తెలంగాణ
కాచెరువు శిఖం భూమిని కాపాడాలి

ఆక్రమణలను అరికట్టి.. హద్దులు నిర్ణయించాలి

ప్రజావాణిలో మత్స్య సహకార సంఘం సభ్యుల వినతి

తెలంగాణ కెరటం కొడంగల్ నియోజకవర్గ ప్రజా ప్రతినిధి నవంబర్ 2

మద్దూరు గ్రామ శివారులోని కాచెరువు శిఖం భూమిని సర్వే చేసి, హద్దులు నిర్ణయించి పరిరక్షించాలని మద్దూరు మత్స్య సహకార సంఘం సభ్యులు కోరారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎంపీడీవో భార్గవ్ రామ్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ.. మద్దూరు మున్సిపాలిటీ పరిధిలోని నిడ్జింత రోడ్డుకు సమీపంలో ఉన్న కాచెరువు పరిధిలో సర్వే నంబర్ లో సుమారు 60 ఎకరాల 10 గుంటల శిఖం భూమి ఉందని తెలిపారు. అయితే, ఈ భూమిలో కొంత భాగాన్ని కొందరు వ్యక్తులు ఆక్రమించి ప్లాట్లుగా విభజిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. చెరువు శిఖం భూమి ఆక్రమణకు గురైతే భవిష్యత్తులో చెరువు ఉనికికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ భూమిని కాపాడటంతో పాటు భవిష్యత్తులో భూ వివాదాలు తలెత్తకుండా సంబంధిత రెవెన్యూ, సర్వే అధికారులు తక్షణమే స్పందించి సమగ్ర సర్వే నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. సదరు భూమికి సంబంధించిన హద్దులను క్షేత్రస్థాయిలో గుర్తించి, హద్దురాళ్లు ఏర్పాటు చేయడం ద్వారా చెరువు శిఖం భూమిని పరిరక్షించాలని ఎంపీడీవో ద్వారా తహసీల్దార్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో మత్స్య సహకార సంఘం కార్యదర్శి నింత విష్ణు, సభ్యులు దాసరి చిన్నప్ప, ఎన్. శ్రీనివాస్, చెన్నప్ప తదితరులు పాల్గొన్నారు...

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: