Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఆదివాసీ పోరాట యోధుడు కొమురం భీం విగ్రహాన్ని ఆవిష్కరించిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావ్...

Author
Posted By TELANGANA KERATAM
| 02 Nov 2026, 07:52 AM | 15 | Politics, తెలంగాణ
ఆదివాసీ పోరాట యోధుడు కొమురం భీం విగ్రహాన్ని ఆవిష్కరించిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావ్...

 తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు....

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలోని అంగడి బజార్ వద్ద నిజాం నవాబు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా “జల్! జంగల్!! జమీన్!!!” అనే నినాదంతో పోరాడి, ఆదివాసీల హక్కుల కోసం తన ప్రాణాలను అర్పించిన ఆదివాసీ వీరుడు, అమరవీరుడు కొమురం భీం విగ్రహాన్ని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ , ఉట్నూర్( ఐ.టి.డి.ఎ) పి. ఓ మంద మకరందు తో కలిసి ఆవిష్కరించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ..ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పాల్గొని వారు మాట్లాడుతూ ఆదివాసీల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఆదివాసీలను అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని అన్నారు.విద్య,వైద్యంతో ఉపాధి కల్పన దిశగా పలు పథకాలు ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. ఆదివాసులు విద్యపై దృష్టి సారించి తమ పిల్లలను ఉన్నతులుగా తీర్చిదిద్దాలని సూచించారు..

ఆదివాసీలతో నాకు 50 సంవత్సరాల అనుబంధం ఉందని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చెప్పారు..

అనాడు ఆదివాసులకు నేను అండగా నిలిచినప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాపైన ఉట్నూర్ పోలీస్ స్టేషన్ లో 38 కేసులు పెట్టారని అన్నారు.అయినా కూడా ఆదివాసుల హక్కుల కోసం పోరాడని తెలిపారు.అనంతరం ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ ఈ దండేపల్లి లో కొమురం భీం విగ్రహాన్ని పెట్టాలనుకున్న మా 20 ఏండ్ల కళ్లను నెరవేర్చినందుకు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కి హృదయపూర్వక ధన్యవాదాలు అని ఆదివాసులు కృతజ్ఞతలు తెలిపారు..ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ , మంచిర్యాల డి.సి.పి భాస్కర్ , ఆసిఫాబాద్ జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షులు కొక్కిరాల విశ్వప్రసాద్ , టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ , ఆదివాసీ నాయకులు పెంద్రం గోపి , కోవ దౌల్తరావు , పెంద్రం శ్రీనివాస్ , మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్,జిల్లా (ఆర్.జి.పి.ఆర్ ఎస్) అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి, సింగిల్ విండో చైర్మన్లు నాగభూషణం, ముత్యాల శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కల వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, మార్కెట్ కమిటీ, సింగిల్ విండో డైరెక్టర్లు, నాయకులు, మహిళా నాయకురాలు, ఆదివాసీలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: