Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల తహసీల్దార్ సస్పెన్షన్ అక్రమ భూ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ వేటు

Author
Posted By TELANGANA KERATAM
| 02 Nov 2026, 09:19 AM | 4 | Politics, తెలంగాణ
నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల తహసీల్దార్ సస్పెన్షన్ అక్రమ భూ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ వేటు

 నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల తహసీల్దార్ సస్పెన్షన్ అక్రమ భూ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో కలెక్టర్ వేటు

తెలంగాణ కెరటం నాగర్‌కర్నూల్ నాగర్‌కర్నూల్ జిల్లాలో అక్రమ భూ రిజిస్ట్రేషన్ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ కఠిన చర్యలు తీసుకున్నారు. ఉప్పునుంతల తహసీల్దార్ ఎ. సునీతను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల ప్రకారం అచ్చంపేట డివిజన్ ఉప్పునుంతల మండలం అయ్యవారిపల్లిలో సర్వే నంబర్ 115కు సంబంధించిన భూ రికార్డుల్లో అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయి. 13 ఎకరాల 17 గుంటల భూమి ఇతరుల పేర్లపై అక్రమంగా నమోదైనట్లు పత్రికల్లో కథనాలు వచ్చాయి. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. అచ్చంపేట సబ్ కలెక్టర్ సలోని చాబ్రాను విచారణ అధికారిగా నియమించారు. పాత పహాణీలు, ఖాస్రా, ఆర్‌ఓఆర్ రికార్డులు, భూ భారతి పోర్టల్ దరఖాస్తులు, డిజిటల్ సంతకాల ప్రక్రియపై విచారణ జరిపారు. విచారణలో అసలు రెవెన్యూ రికార్డులతో కొన్ని భూ నమోదులు సరిపోలలేదని తేలింది. పత్రాల ధృవీకరణలో లోపాలు, విధుల నిర్వహణలో వైఫల్యం ఉన్నట్లు నివేదికలో వెల్లడైంది. అప్పట్లో చారకొండ తహసీల్దార్‌గా పనిచేసిన ఎ. సునీతపై ఈ ఆరోపణలు రావడంతో ప్రస్తుతం డిప్యుటేషన్‌పై ఉప్పునుంతల తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న ఆమెను తెలంగాణ సివిల్ సర్వీసెస్ నిబంధనల ప్రకారం సస్పెండ్ చేశారు. క్రమశిక్షణా విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ అమల్లో ఉంటుందని కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: