, తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 2, నవంబర్
రూట్స్ ట్రక్ మౌంటెడ్ రోడ్ స్వీపింగ్
మీషిన్లను టిప్పర్లను ప్రారంభించిన *గూడెం మహిపాల్ రెడ్డి,పటాన్చెరు మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్...*
తోషిబా వారి సౌజన్యంతో సిఎస్ఆర్ నిధులు రూపాయలు 5 కోట్ల 32 లక్షల అంచనా వ్యయంతో పటాన్చెరు మరియు అమీన్పూర్ సర్కిల్ కు 10 పారిశుధ్య వాహనాలు పంపని……
5స్వీపింగ్ ట్రక్ మరియు 5 టిప్పర్ లను ఈ రోజు *శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ,జోనల్ కమీషనర్ నారాయణ్ అమిత్ ,పటాన్చెరు మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్* కలిసి ప్రారంభించారు….
వారితో పాటు పటాన్చెరు డిప్యూటీ కమీషనర్ శ్రావ్య ,అమీనాపూర్ డిప్యూటీ కమీషనర్ లలిత ,తోషిబా సీనియర్ మేనేజర్ అడ్మినిస్ట్రేషన్ రాజా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో రోడ్ల శుభ్రత,పర్యావరణ పరిరక్షణే దెయ్యంగా రోడ్డు స్వీపింగ్ మెషిన్లు వచ్చాయి అన్ని స్థానిక కార్పొరేటర్ల చొరువతో ఈ ప్రతిపాదన సాకారమైంది అన్ని అన్నారు.
ఈ కార్యక్రమంలో భారతి నగర్ మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి ,రామచంద్రపురం మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య యాదవ్ ,మాజీ మునిసిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి,మాజీ మునిసిపల్ వైస్ చైర్మన్ నందారం నర్సింహ గౌడ్ ,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్ నియోజకవర్గ స్థాయి ప్రజా ప్రతి నిధులు ,దాత సంస్థ అయిన తోషిబా కంపెనీ ప్రతినిధులు ,తయారీ సమస్త అయిన రూట్స్ మల్టీ క్లీన్ రాజు మున్నర్,రూట్స్ మల్టీ క్లీన్ లిమిటెడ్ హైదరాబాద్ బ్రాంచ్ ప్రతినిధులు పాల్గొన్నారు.
