తెలంగాణ కెరటం ఘట్కేసర్ ప్రతినిధి నవంబర్
మేడ్చల్ జిల్లా :- ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని ఎదులాబాద్ గ్రామానికి చెందిన మాచెర్ల వంశీకృష్ణ (మాచి) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్‌డెడ్‌కు గురయ్యారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు గొప్ప మనసుతో అవయవదానానికి అంగీకరించడంతో ఐదుగురికి ప్రాణదానం లభించింది. మరణంలోనూ మానవత్వం చాటిన వంశీకృష్ణ త్యాగం ఎదులాబాద్ గ్రామానికి చిరస్థాయిగా నిలిచిపోనుంది. బుధవారం స్వగ్రామం ఎదులాబాద్‌లో జరిగిన అంత్యక్రియలకు స్నేహితులు, బంధువులు పెద్ద సంఖ్యలో హాజరై కన్నీటి వీడ్కోలు పలికారు. స్నేహితుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఒక కుటుంబం తన బిడ్డను కోల్పోయిన బాధలోనూ ఐదు కుటుంబాల్లో వెలుగులు నింపిన వంశీకృష్ణ కుటుంబం నిర్ణయం అందరికీ ఆదర్శంగా నిలిచింది.
