Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

నారాయణాద్రి కాలనీలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

Author
Posted By TELANGANA KERATAM
| 17 Nov 2026, 06:55 AM | 4 | NATIONAL, Politics, తెలంగాణ
నారాయణాద్రి కాలనీలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం
- రూ.42 లక్షల వ్యయంతో రోడ్డు నిర్మాణం
(తెలంగాణ కెరటం) ఘట్‌కేసర్ ప్రతినిధి / నవంబర్ 16: పోచారం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఇస్మాయిల్‌ఖాన్‌గూడ నారాయణాద్రి కాలనీలో రూ.42 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. టీమ్ రేవంత్ అన్న రాష్ట్ర నాయకుడు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో 8వ వార్డులోని 3వ, 4వ రోడ్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. వార్డు పరిధిలోని కాలనీల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. సీసీ రోడ్డు నిర్మాణం పూర్తయితే కాలనీవాసులకు రాకపోకలు సులభతరం అవుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇస్మాయిల్‌ఖాన్‌గూడ వార్డు అధ్యక్షుడు కొండకళ్ల లింగం, బీసీ విభాగం కన్వీనర్ గొంగళ్ల చంద్రకాంత్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: