Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

మైనర్లతో ట్రాక్టర్ల డ్రైవింగ్.. నంబర్ ప్లేట్లు లేకుండానే అధిక వేగంగా రాకపోకలు

Author
Posted By TELANGANA KERATAM
| 11 Nov 2026, 03:09 PM | 191 | Politics, తెలంగాణ
మైనర్లతో ట్రాక్టర్ల డ్రైవింగ్.. నంబర్ ప్లేట్లు లేకుండానే అధిక వేగంగా రాకపోకలు
*పెద్దవాగు పరివాహక ప్రాంతంలో విచ్చలవిడిగా  ఇసుక దందా!*

మైనర్లతో ట్రాక్టర్ల డ్రైవింగ్.. నంబర్ ప్లేట్లు లేకుండానే అధిక వేగంగా రాకపోకలు

అధికారులు స్పందించకపోవడంపై మర్మమేమిటో


 తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 11 :
 

నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని తొర్తి  గ్రామ పరిధిలో ఉన్న పెద్దవాగు నదీ పరివాహక ప్రాంతం నుంచి చలో విచ్చల విడిగా  ఇసుక తరలిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణా జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు తగిన చొరవ చూపడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా ఇసుకను తరలిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఇసుక రవాణా చేస్తున్న కొన్ని ట్రాక్టర్లకు నంబర్ ప్లేట్లు లేకపోవడం, డ్రైవింగ్ లైసెన్సులు లేని మైనర్ బాలురతో వేగంగావాహనాలు నడిపిస్తున్నారనే ఆరోపణలుమరింతఆందోళనకలిగిస్తున్నాయి.అధికవేగంతోట్రాక్టర్లుగ్రామీణరహదారులపైదూసుకెళ్తుండటంతో పాదచారులు, ద్విచక్ర వాహనదారులు ప్రమాద భయంతో ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంటోంది. ఇసుక ట్రాక్టర్ల రాకపోకల కారణంగా రోడ్లపై దుమ్ము ధూళి విపరీతంగా వ్యాపించి ఇళ్లలోకి చేరుతోంది. దీంతో చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారు.మరోవైపు రాత్రివేళల్లో ట్రాక్టర్ల ఇంజిన్ల శబ్దాలతో గ్రామస్తులకు నిద్రాభంగం కలుగుతోంది. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇంత జరుగుతున్నా మైనింగ్ శాఖ, రెవెన్యూ శాఖ,  అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఇట్టి మౌనం వెనుక మర్మమేందో అర్థం కావడం లేదని   ప్రజలు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: