Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడితే కఠిన చర్యలు

Author
Posted By TELANGANA KERATAM
| 11 Nov 2026, 08:39 PM | 3 | Politics, తెలంగాణ
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడితే కఠిన చర్యలు
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడితే కఠిన చర్యలు

మున్సిపల్ కమిషనర్ రాఘవేంద్ర 

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 11 : సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ రాఘవేంద్ర హెచ్చరించారు. కోరుట్ల మున్సిపల్ కమీషనర్ రాఘవేంద్ర ఆదేశాల మేరకు బుధవారం అధికారులు కోరుట్ల పట్టణంలోని పలు కిరాణా, సూపర్ మార్కెట్ లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, వారు వినియోగిస్తున్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ స్వాధీన పరుచుకున్నారు. చెత్తను బయట పడేసిన ఓ ఇంటి యజమానికి 09,500 రూపాయలు జరిమానాలు విధించడంతో పాటు అవగాహన కల్పించారు. ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చెయ్యని దుకాణాదారులకు ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమీషనర్ రాఘవేంద్ర మాట్లాడుతూ.. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తిస్థాయిలో నిషేదించాలని, లేనియెడల భారీ జరిమానాలు విధించడంతో పాటు దుకాణాలు సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ట్రేడ్ లైసెన్స్ లేని వారు వెంటనే తీసుకోవాలని కోరారు. వ్యాపార కార్యకలాపాలతో వెలువడిన చెత్తను తడి, పొడి,హానికరక చెత్తగా వేరు చేసి షాప్ వద్దకు వచ్చే మున్సిపల్ వాహనాలకు అందించాలని తెలిపారు. లేనిచో ఎస్ డబ్ల్యూఎం-2026 చట్టం ప్రకారం జరిమానా విధించబడతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్, జవాన్లు నవీన్, చంద్ర ప్రకాష్, జగ్గల్ల రమేష్, రాజు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: