Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ముఖ్యమంత్రి సభను విజయవంతం చేయాలి. -ఇందిరమ్మ కుటుంబ బీమా, రెండో విడత ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభోత్సవానికి మహిళలు పెద్ద సంఖ్యలో తరలిరావాలి.-దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ పిలుపు.

Author
Posted By Kancharala Shivakumar
| 17 Nov 2026, 07:19 PM | 3 | తెలంగాణ
ముఖ్యమంత్రి సభను విజయవంతం చేయాలి. -ఇందిరమ్మ కుటుంబ బీమా, రెండో విడత ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభోత్సవానికి మహిళలు పెద్ద సంఖ్యలో తరలిరావాలి.-దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ పిలుపు.

దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 17, తెలంగాణ కెరటం: 

సిద్దిపేటలో రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పాల్గొననున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.ఈ సభలో ప్రతిష్టాత్మకమైన ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని ప్రారంభించడంతో పాటు, రెండో విడత ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్న నేపథ్యంలో మహిళా సోదరీమణులు పెద్ద సంఖ్యలో సభకు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పేదలు, మహిళలు, రైతులు, కార్మికుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ప్రజలకు ఉపయోగపడే అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజా పాలనకు నిదర్శనంగా నిలుస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి భరోసా కల్పిస్తున్నాయని అన్నారు.దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు, అభిమానులు, ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి ముఖ్యమంత్రి సభను విజయవంతం చేయాలని పాతూరి వెంకటస్వామి గౌడ్ కోరారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: