క్షేత్రస్థాయిలో బలోపేతం దిశగా గులాబీ దళం.. రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ
నిర్మల్ జిల్లాలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ బలం క్రమంగా పెరుగుతోందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువయ్యేందుకు చేస్తున్న ప్రయత్నాలు పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నాయి.
ఇటీవల యువ నాయకులు పార్టీలో చేరడం, రైతు సమస్యలపై కార్యక్రమాలు నిర్వహించడం, పార్టీ ముఖ్య నేతల పర్యటనలతో జిల్లాలో బీఆర్ఎస్ రాజకీయ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా యువతను పార్టీలోకి ఆహ్వానించడం, గ్రామస్థాయిలో నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేయడంపై నాయకత్వం దృష్టి సారిస్తోంది.
ఇటీవల నల్ల వినయ్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరడం, కేటీఆర్ రైతు గర్జన సభ కోసం నిర్మల్ పర్యటన చేపట్టడం పార్టీకి రాజకీయంగా ప్రాధాన్యతను తీసుకొచ్చాయి.
రాబోయే రోజుల్లో మరింత మంది నాయకులు, యువకులు బీఆర్ఎస్ వైపు అడుగులు వేస్తారా? జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అవుతుందా? అనేది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.
.



