Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

హలో నేతన్న చలో చేనేత భవన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

Author
Posted By TELANGANA KERATAM
| 23 Nov 2026, 06:12 AM | 4 | Politics, తెలంగాణ
హలో నేతన్న చలో చేనేత భవన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
చేనేత కార్మికులకు పింఛన్లు మంజూరు చేయాలి
పద్మశాలి సంఘం జిల్లా యువజన అధ్యక్షుడు పోల నవీన్ కుమార్
కౌడిపల్లి తెలంగాణ కెరాటం నవంబర్ 22:

 మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోనీ జిల్లా అధ్యక్షులు నవీన్ కుమార్ మాట్లాడుతూ చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం, అర్హులైన కార్మికులకు పింఛన్ల మంజూరు డిమాండ్‌తో నేడు 23న హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం (టీఆర్‌పీఎస్) ఆధ్వర్యంలో నిర్వహించనున్న హలో నేతన్న.. చలో చేనేత భవన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మెదక్ జిల్లా పద్మశాలి సంఘం యువజన అధ్యక్షుడు పోల నవీన్ కుమార్ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 50 ఏళ్లు నిండిన చేనేత కార్మికులకు చేయూత పథకం కింద పింఛన్లు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, జిల్లాలో అర్హులైన పద్మశాలి చేనేత కార్మికులకు ఇప్పటివరకు ఒక్క పింఛన్ కూడా మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ప్రభుత్వం వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులతో పాటు పలువర్గాలకు చేయూత పింఛన్లు మంజూరు చేసినప్పటికీ, చేనేత కార్మికులను విస్మరించడం బాధాకరమన్నారు.జిల్లావ్యాప్తంగా 50 ఏళ్లు నిండిన పలువురు పద్మశాలి చేనేత కార్మికులు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ, ప్రభుత్వ, అధికారుల నిర్లక్ష్యంతో వారికి పింఛన్లు అందడం లేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో పద్మశాలి చేనేత కార్మికులకు పింఛన్లు అందిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, ప్రస్తుతం ఆ హామీని అమలు చేయడంలో జాప్యం చేస్తోందని పేర్కొన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి 50 ఏళ్లు నిండిన పద్మశాలి చేనేత కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మికుల పింఛన్లతో పాటు ఇతర సమస్యల పరిష్కారం కోసం నేడు 23న హైదరాబాద్‌లో నిర్వహించే హలో నేతన్న.. చలో చేనేత భవన్ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న పద్మశాలీలు, చేనేత కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని పోల నవీన్ కుమార్ కోరారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: