Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

లాడ్జిలలో కోరుట్ల పోలీసుల ఆకస్మిక తనిఖీలు..

Author
Posted By TELANGANA KERATAM
| 23 Nov 2026, 06:31 AM | 2 | Crime, తెలంగాణ
లాడ్జిలలో కోరుట్ల పోలీసుల ఆకస్మిక తనిఖీలు..
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 22 : కోరుట్ల పట్టణంలోని వివిధ లాడ్జిలను ఆదివారం సాయంత్రం 
కోరుట్ల సీఐ కొమ్ము తిరుపతి, ఎస్ఐ జి.శ్యాం రాజ్, పోలీస్ సిబ్బందితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా లాడ్జిల రిసెప్షన్ సిబ్బందితో మాట్లాడి, లాడ్జిలలో బస చేస్తున్న వ్యక్తుల వివరాలు, వారి గుర్తింపు పత్రాలు, రిజిస్టర్లను పరిశీలించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తుల వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని లాడ్జి నిర్వాహకులకు సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా గుర్తు తెలియని వ్యక్తులు లాడ్జిలో బస చేస్తున్నట్లు గుర్తించిన వెంటనే పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు. లాడ్జిలను ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఉపయోగించకుండా నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఎవరైనా లాడ్జిలలో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినట్లు గుర్తిస్తే, వారిపై, వారికి సహకరించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఇటువంటి ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని సీఐ కొమ్ము తిరుపతి తెలిపారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: