Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ప్రజాస్వామ్య బద్ధంగా సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలి

Author
Posted By TELANGANA KERATAM
| 25 Nov 2026, 07:33 AM | 4 | Politics, తెలంగాణ
ప్రజాస్వామ్య బద్ధంగా సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలి
ప్రజాస్వామ్య బద్ధంగా సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలి

సింగిల్ విండో చైర్మెన్ల ఫోరం జిల్లా ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నర్సారెడ్డి 

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 24 : ప్రజాస్వామ్య బద్ధంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలని జగిత్యాల జిల్లా సింగిల్ విండో చైర్మెన్ల ఫోరం ఉపాధ్యక్షులు, ఎకీన్ పూర్ సింగిల్ విండో చైర్మెన్ సింగిరెడ్డి నర్సారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎన్నికలు జరిగే వరకు పాత పాలకవర్గాలనే కొనసాగించాలని, వారినే పాలకవర్గ సభ్యులుగా నియమించాలని హైకోర్టు తీర్పు ఇవ్వడం శుభపరిణామం అని పేర్కొన్నారు. రైతుల భాగస్వామ్యంతో నడిచే సహకార సంఘాల్లో ఎన్నికలు నిర్వహించాలనే హైకోర్టు తీర్పును ప్రభుత్వం శిరసావహించాలని కోరారు. నామినేటెడ్ పాలకవర్గ సభ్యుల ఎంపికను ప్రభుత్వం ఉపసంహరించాలని హైకోర్టు తీర్పు ఇచ్చిందని, ఇందుకు కృషి చేసిన తెలంగాణ రాష్ట్ర సింగిల్ విండో చైర్మెన్ల ఫోరంకు సింగిరెడ్డి నర్సారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: