Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు సిఎం సహాయ నిధి అండ

Author
Posted By TELANGANA KERATAM
| 25 Nov 2026, 08:20 AM | 6 | Politics, తెలంగాణ
ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు సిఎం సహాయ నిధి అండ

లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందజేసిన మంత్రి సీతక్క

ములుగు క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సిఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

ములుగు జిల్లా బ్యూరో, (తెలంగాణ కెరటం) నవంబర్ 24:
ములుగు జిల్లా కేంద్రంలోని మంత్రి సీతక్క క్యాంపు కార్యాలయంలో మంగళవారం ముఖ్య మంత్రి సహాయ నిధి (సిఎంఆర్ఎఫ్) ద్వారా మంజూరైన ఆర్థికసాయం చెక్కులను లబ్ధిదారులకు పంచాయతీ రాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ..ఆర్థిక ఇబ్బందులతో వైద్య చికిత్స పొందుతున్న పేద,మధ్య తరగతి కుటుంబాలకు సిఎం సహాయనిధి ఎంతో తోడ్పాటును అందిస్తోందని తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చులు భరించలేని నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తూ,వారి ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోందని పేర్కొన్నారు.సామాన్య ప్రజల ఆరోగ్యం,సంక్షేమం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతా అంశాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వసాయం అందేలా కృషి చేస్తున్నామని అన్నారు.ఆపదలో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందుతున్న ఆర్థిక సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు.ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ,వారి అవసరాలకు అనుగుణంగా సహాయ సహకారాలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముసినెపల్లి కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా మత్స్య శాఖ అధ్యక్షుడు కంబాల రవి,ములుగు పట్టణ అధ్యక్షుడు లావుడ్య రమేశ్,పత్తిపల్లి గ్రామ కమిటి అధ్యక్షుడు అర్షం రఘు తదితరులు పాల్గొన్నారు.
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: