లంబాడీ జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటేలా సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహం.
సీఎం రేవంత్ రెడ్డి రాక కోసం నల్లమల ప్రజల ఎదురుచూపు.
మద్దిమడుగులో రూ.38 కోట్లతో విగ్రహం, భారీ మండపం నిర్మాణానికి భూమిపూజ.
అచ్చంపేట సభా వేదికగా రూ.78 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం.
ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ డాక్టర్ మల్లు రవి.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 25):
లంబాడ గిరిజన జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటేలా సంత సేవా లాల్ మహారాజ్ విగ్రహం ఏర్పాటు తో నేడు గురువారం సీఎం రేవంత్ రెడ్డి రాక కోసం నల్లమల ప్రజలు ఎదురుచూస్తున్నారని టీపీసీసీ ఉపాధ్యక్షులు డిసిసి అధ్యక్షులు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. మద్దిమడుగు గ్రామంలో 38 కోట్లతో సంత్ సేవాలాల్ విగ్రహం మరియు మండపం నిర్మాణానికి భూమి పూజ సీఎం చేయనున్నారని తెలిపారు బుధవారం నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి,ప్రభుత్వ విప్ వేముల వీరేశంవిద్యా కమిషన్ సభ్యులు చారకొండ వెంకటేష్ టి -షాట్
చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి,
ప్రజా ప్రతినిధులు,
అధికారులు ,నాయకులు కార్యకర్తలు కలిసి అచ్చంపేట మండల పరిధిలోని వై జంక్షన్ వద్ద ఏర్పాటుచేసిన సభా వేదికను పరిశీలించారు.



