Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకం ద్వారా ప్రతి అర్హత కుటుంబానికి ఆర్థిక భరోసా

Author
Posted By TELANGANA KERATAM
| 26 Nov 2026, 07:24 AM | 3 | Politics, తెలంగాణ
ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకం ద్వారా  ప్రతి అర్హత కుటుంబానికి ఆర్థిక భరోసా
ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకం ద్వారా 
ప్రతి అర్హత కుటుంబానికి ఆర్థిక భరోసా........

రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద.........
తెలంగాణ కెరటం మంచిర్యాల బ్యూరో చీఫ్ రాం వేణు......
మంచిర్యాల.....చెన్నూర్ నియోజకవర్గం జైపూర్,  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా ప్రతి అర్హత కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడం జరుగుతుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేక్ అన్నారు. బుధవారం జిల్లాలోని జైపూర్ మండలం గంగిపల్లి గ్రామపంచాయతీలో జీవిత భీమా నమోదు ప్రక్రియను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీపతి బాపు లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి అర్హులైన కుటుంబానికి జీవిత భద్రత కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. రేషన్ కార్డు ఆధారంగా కుటుంబంలోని 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగిన అర్హులైన సభ్యులకు 5 లక్షల రూపాయల జీవిత భీమా సౌకర్యం కల్పించడం జరుగుతుందని తెలిపారు. కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు నామినీల వివరాలు, వారికి కేటాయించవలసిన వాటాలను నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. నమోదు సమయంలో వివరాలను పరిశీలించి, కుటుంబ సభ్యుల ఆమోదం పొందిన అనంతరం ఆన్‌లైన్‌లో సమర్పిస్తారని, వెంటనే మొబైల్‌కు సందేశంతో పాటు లింక్ వస్తుందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ క్రింద 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సేవలు, కొత్తగా ఆసరా పెన్షన్ల మంజూరు వంటి పథకాలను అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు ఉచిత బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించామని, విద్యార్థులు బాగా చదువుకొని మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. గంగిపల్లి గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. గ్రామానికి 118 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా, ఇప్పటికే 85 ఇండ్లు వివిధ నిర్మాణ దశలలో ఉన్నాయని, మిగిలిన ఇండ్లను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. గ్రామ పాఠశాల అభివృద్ధికి 50 లక్షల రూపాయలు, గత సంవత్సరం 15 లక్షల రూపాయలు, ప్రస్తుత సంవత్సరం మరో 15 లక్షల రూపాయలు సిఎస్‌ఆర్ నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. గంగిపల్లి నుంచి ఎల్కంటి వరకు 1 కోటి 57 లక్షల రూపాయలతో చేపట్టిన పంచాయతీరాజ్ రహదారి ప్రారంభించడం జరిగిందని, గంగిపల్లి నుంచి గోదావరి సమీపంలోని శ్మశాన వాటిక వరకు రహదారి నిర్మాణానికి 2 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. గ్రామ ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను దశలవారీగా చేపడతామని తెలిపారు. జైపూర్ పవర్ ప్లాంట్‌లో గ్రామానికి చెందిన ఐదుగురికి తక్షణమే ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో 1 వేయి 250 మెగావాట్ల నూతన విద్యుత్ ప్లాంట్ ప్రారంభమైనప్పుడు భూములు ఇచ్చిన నిర్వాసితులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ గంగిపల్లి గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని తెలిపారు.జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గంగిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను సాచురేషన్ ప్రాతిపదికన మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. జైపూర్ మండలంలోని ఇతర గ్రామపంచాయతీలతో పోలిస్తే గంగిపల్లిలో అత్యధికంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను పరిశీలించామని, పాఠశాలలో తగినన్ని మరుగుదొడ్ల సౌకర్యాలు ఉన్నాయని, విద్యార్థుల సంఖ్యను మరింత పెంచేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అంగన్‌వాడీ కేంద్రంలో విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్య అందించడం జరుగుతుందని తెలిపారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకం ద్వారా కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని, ప్రస్తుతం అమలులో ఉన్న రైతు భీమా, ఇతర వృత్తుల వారికి సంబంధించిన భీమా పథకాలు అందరికీ వర్తించని నేపథ్యంలో, అన్ని అర్హులైన కుటుంబాలకు వర్తించేలా ఈ సార్వత్రిక జీవిత భీమా పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. నమోదు సమయంలో కుటుంబ సభ్యుల వివరాలు, నామినీల వివరాలు, వాటాల కేటాయింపులను జాగ్రత్తగా నమోదు చేయాలని, నమోదు చేసిన వివరాలను ప్రివ్యూలో పరిశీలించి సరిచూసుకున్న తర్వాతే సమర్పించాలని సూచించారు. వివరాలు సమర్పించిన వెంటనే మొబైల్‌కు సందేశం, లింక్ వస్తాయని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా కొత్తగా 10 వేల 360 పెన్షన్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, భీమా, పెన్షన్లు, ఆహార భద్రత పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకుంటామని, ఎవరైనా అర్హులు పథకాల ప్రయోజనాలు పొందకుండా మిగిలిపోతే అధికారుల దృష్టికి తీసుకురావాలని, సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: