Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఇంటి దొంగతనం కేసును ఛేదించిన ఘట్‌కేసర్ పోలీసులు

Author
Posted By TELANGANA KERATAM
| 26 Nov 2026, 08:17 AM | 9 | Crime, తెలంగాణ
ఇంటి దొంగతనం కేసును ఛేదించిన ఘట్‌కేసర్ పోలీసులు

18 తులాల బంగారం చోరీ.. 10 మంది నిందితుల అరెస్ట్‌

 మరో నిందితుడు పరారీ.. బంగారు, వెండి ఆభరణాలు, నగదు, రెండు ఐఫోన్లు స్వాధీనం(తెలంగాణ కెరటం) ఘట్‌కేసర్ ప్రతినిధి / నవంబర్ 25: ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండాపూర్ గ్రామం లేక్ వ్యూ ఎన్‌క్లేవ్, వైష్ణవి రెసిడెన్సీలో జరిగిన ఇంటి దొంగతనం కేసును పోలీసులు ఛేదించి 10 మంది నిందితులను అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం.. వైష్ణవి రెసిడెన్సీకి చెందిన వి. నవీన్ కుమార్ ఈ నెల 14న కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి బోడుప్పల్‌లోని స్నేహితుడి ఇంటికి వెళ్లారు. ఈ నెల 18న తిరిగి వచ్చి చూడగా కిటికీ పగలగొట్టి ఉండటంతో పాటు బీరువాలో భద్రపరిచిన సుమారు 18 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించి ఈ నెల 24న యంనంపేట్ఎ క్స్ రోడ్ వద్ద అరెస్టు చేశారు.

అరెస్టయిన నిందితుల వివరాలు:

1. కె. సామేల్ అలియాస్ నాని అలియాస్ సాంబేల్ (19) – కూలీ, గాంధీనగర్, ఘట్‌కేసర్.2. పిట్టల ఉమర్ అలియాస్ షేక్ ఉమర్ (18) – ఆటో డ్రైవర్, గాంధీనగర్, ఘట్‌కేసర్.3. షేక్ సద్దాం షరీఫ్ (21) – బాలాజీనగర్, ఘట్‌కేసర్.4. పిట్టల పాపిత (33) – గృహిణి, గాంధీనగర్, ఘట్‌కేసర్.5. మార్కల సాయికుమార్ (21) – పండ్ల వ్యాపారి, గాంధీనగర్, ఘట్‌కేసర్.6. ఎస్‌డీ సిద్దిఖ్ (22) – ప్రైవేట్ ఉద్యోగి, షేక్‌పేట్.7. నోకటాల మోతీలాల్ (29) – ఆటో డ్రైవర్, మైసమ్మగుట్ట కాలనీ, ఘట్‌కేసర్.8. నోకటాల షబ్బు (24) – గృహిణి, మైసమ్మగుట్ట కాలనీ, ఘట్‌కేసర్.9. శక్తి విశాల్ (24) – వ్యాపారం, చిలకలగూడ, సికింద్రాబాద్.10. గణశాల రైలాన్ మ్యాక్స్ (20) – క్యాటరింగ్ పని, ఉపమాక గ్రామం, అనకాపల్లి జిల్లా.

ఇవి కూడా చదవండి

పరారీలో ఉన్న నిందితుడు మానుసాల వెంకటేష్ (24), కార్ మెకానిక్, తుని, అనకాపల్లి జిల్లా.
స్వాధీనం చేసుకున్న సొత్తు:
నిందితుల నుంచి బంగారు నెక్లెస్, బుట్ట కమ్మలు, చంద్రహారం, జడపువ్వు, గొలుసులు, ఉంగరాలు, సుమారు 24 తులాల వెండి ఆభరణాలు, ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, రూ.53 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

News Image

ఆపరేషన్‌లో పాల్గొన్న పోలీసు బృందం: మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి, ఐపీఎస్ మార్గదర్శకత్వంలో ఘట్‌కేసర్ ఇన్‌స్పెక్టర్ పి. కిరణ్, ఎస్‌ఐ ఎ. రాఘవేంద్ర ఆధ్వర్యంలో హెచ్‌సీలు ఆర్. రాజేష్, పి. విజయ్ కుమార్, పీసీలు పి. రాజు, ఎన్. నరేష్, నరేందర్, బి. సైదులు, మహిళా పీసీ బి. మహేశ్వరి, హోంగార్డు బి. శ్రీను ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించారు. నిందితులను అరెస్టు చేయడంలో విశేష కృషి చేసిన పోలీసు అధికారులను, సిబ్బందిని పోలీస్ కమిషనర్ బి. సుమతి అభినందించారు. ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, ఇళ్ల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: