Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

భార్యపై అనుమానం.. ఆస్తి కోసం అత్తపై కత్తితో దాడి

Author
Posted By TELANGANA KERATAM
| 24 Nov 2026, 08:23 PM | 6 | Crime, తెలంగాణ
భార్యపై అనుమానం.. ఆస్తి కోసం అత్తపై కత్తితో దాడి
భార్యపై అనుమానం.. ఆస్తి కోసం అత్తపై కత్తితో దాడి

- అల్లుడు రాజేష్ అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు

ములుగు జిల్లా బ్యూరో, (తెలంగాణ కెరటం) నవంబర్ 24:

భార్యపై అనుమానం,ఆస్తి వివాదం నేపథ్యంలో అత్తపై అల్లుడు కత్తితో హత్యాయత్నానికి పాల్పడిన ఘటన ములుగు జిల్లా మల్లంపల్లి మండల కేంద్రంలో జరిగింది.ఈ ఘటన మల్లంపల్లిలో కలకలం రేపింది.ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అత్త బత్తిని లక్ష్మి(60) హన్మ కొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.పోలీసుల వివరాల ప్రకారం.. మల్లంపల్లికి చెందిన దూమల రాజేష్(37)కు బత్తిని మానసతో 13 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది.వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.కొంత కాలంగా భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న రాజేష్ వేధింపులకు గురి చేయడంతో మానస ఏప్రిల్ 1 నుండి పుట్టింట్లో ఉంటోంది.గతంలో భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిన భూమి,ఇంటిని తిరిగి తన పేరు మీద మార్చాలని రాజేష్ ఒత్తిడి చేస్తూ వచ్చాడు.ఈ క్రమంలో సోమవారం సాయంత్రం భార్య ఇంటికి వెళ్లి గొడవపడి వారిని చంపుతానని బెదిరించి నట్లు పోలీసులు తెలిపారు.ముందస్తు పథకంతో ఆన్‌లైన్‌లో కత్తి కొనుగోలు చేసిన రాజేష్ మంగళవారం తెల్లవారు జామున 5 : 30 గంటల సమయంలో అత్తగారి ఇంటికి చేరుకున్నాడు. తలుపు తీసిన అత్త బత్తిని లక్ష్మిపై మెడ భాగంలో కత్తితో దాడి చేశాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన భార్య మానసపై సైతం దాడికి యత్నించగా ఆమె తప్పించుకుని కేకలు వేసింది.దీంతో ఇరుగు పొరుగు వారు అక్కడికి చేరుకోవడంతో నిందితుడు కత్తితో పరారయ్యాడు.తీవ్రంగా గాయపడిన లక్ష్మిని కుటుంబ సభ్యులు, స్థానికులు హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ములుగు పోలీసులు గాలింపు చేపట్టి నిందితుడు రాజేష్‌ను నేరానికి ఉపయోగించిన కత్తితో సహా అదుపులోకి తీసుకున్నారు.అనంతరం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌కు తరలించినట్లు ములుగు ఎస్సై వెంకటేశ్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: