పలు ప్రాంతాల్లో వివాహ వేడుకలు, శుభ కార్యక్రమాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పటాన్చెరు మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్
తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 26, నవంబర్
ఈ సందర్భంగా పాల్గొన్న కార్యక్రమాల వివరాలు:పటాన్చెరు వీరభద్రీయ సంఘ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.పాటిలోని ఎస్ వి ఆర్ గార్డెన్స్‌లో గుజ్జేటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన హర్ష వర్ధన్ హర్షిత వివాహ వేడుకలో పాల్గొన్నారు.ముత్తంగిలోని పీసర్గా ర్డెన్ ఫంక్షన్ హాల్‌లో పల్లె నర్సింహ ఆధ్వర్యంలో నిర్వహించిన చైతన్య ఉదయ్ కిరణ్ వివాహ వేడుకలో పాల్గొన్నారు.ఉస్మాన్ నగర్‌లోని హెచ్ వై-ఓ ఎన్ ఈ కన్వెన్షన్‌లో కోడిమల శ్రీనివాస్ రాజ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన కౌశిక్ రాజ్ శ్రావణి వివాహ వేడుకలో పాల్గొన్నారు.
ఉస్మాన్ నగర్‌లోని హెచ్ వై-ఓ ఎన్ ఈకన్వెన్షన్‌లో ఉట్ల కార్తీక్ గిమ్కల గారి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రావణి గిమ్కల & కోడిమల కౌశిక్ రాజ్ వివాహ వేడుకలో పాల్గొన్నారు.యెల్వర్తిలోని వజ్ర కన్వెన్షన్‌లో గడ్డం శ్రీశైలం ఆధ్వర్యంలో నిర్వహించిన అరవింద్ కుమార్ & సౌమ్య వివాహ వేడుకలో పాల్గొన్నారు.పాటిలోని రామ సంజీవ రెడ్డి గార్డెన్స్‌లో యార్డనూరి మల్లయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన నందిని & రాఘవేందర్ వివాహ వేడుకలో పాల్గొన్నారు.షావుకారిపేట, తాండూరులోని ఆర్యవైశ్య ఓపెన్ ఫంక్షన్ హాల్‌లో ప్రభాకర్ గుప్తా ఆధ్వర్యంలో నిర్వహించిన వివేకానంద గుప్తా & ఐశ్వర్య వివాహ వేడుకలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదిస్తూ వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. నూతన గృహప్రవేశం చేసుకున్న కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి కుటుంబాల్లో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు సమృద్ధిగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమాల్లో ఆయా కుటుంబాల సభ్యులు, బంధుమిత్రులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.



