శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ.l
తెలంగాణ కెరటం – మనోహరాబాద్: మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని కాళ్లకల్ గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు గురువారం యాదవ సంఘం ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించారు.ఈ సందర్భంగా వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, శాస్త్రోక్తంగా శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టారు.ఆలయ పునర్నిర్మాణ పనులు విజయవంతంగా పూర్తి కావాలని స్వామివారిని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామ సర్పంచ్,ఉప సర్పంచ్,వార్డు సభ్యులు,వివిధ రాజకీయ పార్టీల నాయకులు,కుల సంఘాల నాయకులు,యాదవ సంఘం సభ్యులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.



