Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

రాజ్యాంగ దినోత్సవం రోజున అంబేద్కర్‌కు నివాళులర్పించకుండా అడ్డుకున్నారు.

Author
Posted By TELANGANA KERATAM
| 26 Nov 2026, 05:24 PM | 3 | Politics, తెలంగాణ
రాజ్యాంగ దినోత్సవం రోజున అంబేద్కర్‌కు నివాళులర్పించకుండా అడ్డుకున్నారు.
రాజ్యాంగ దినోత్సవం రోజున అంబేద్కర్‌కు నివాళులర్పించకుండా అడ్డుకున్నారు.

సీఎం పర్యటన నేపథ్యంలో ఇంటికి వచ్చి అరెస్టు చేశారు.

 పాత్కుల శ్రీశైలం ఆవేదన.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 26):

మాలల రోస్టర్ పాయింట్ల సమస్య పరిష్కరించాలని, ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా నిరసన తెలిపే అవకాశం ఉందనే కారణంతో గురువారం ఇంటెలిజెన్స్ అధికారులు ఇంటికి వచ్చి తనను అరెస్టు చేయడం జరిగిందని పాత్కుల శ్రీశైలం ఆవేదన వ్యక్తం చేశారు.మాల సామాజిక వర్గానికి సంబంధించిన రోస్టర్ పాయింట్ల సమస్యపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, తమ హక్కుల కోసం గొంతెత్తడం తప్పా అని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి ఉందని, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకుండా ముందస్తు అరెస్టులతో గొంతు నొక్కడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు.నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌కు నివాళులర్పించాల్సిన రోజున తనను అరెస్టు చేసి ఆ అవకాశాన్ని కూడా దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు, భావప్రకటనా స్వేచ్ఛ, నిరసన తెలిపే హక్కులను ప్రభుత్వాలు గౌరవించాలని ఆయన డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం కోసం ప్రశ్నించే గొంతులను అణచివేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: