సీఎం కు టీఆర్పీ అంటే భయం.
అందుకే ముదస్తు అరెస్ట్.
జిల్లా అధ్యక్షులు.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూలు జిల్లా ప్రతినిధి (నవంబర్ 26):
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం లో ముఖ్యమంత్రి రేవంత్ పర్యటన చేయడానికి టీఆర్పీ నాయకులను ముదస్తు అరెస్ట్ చేపించడని టీఆర్పీ జిల్లా అధ్యక్షులు తీవ్రంగా ఖండించారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మధ్యలో పర్యటించడానికి భయపడుతుందని ప్రజాపాలనలో ఇచ్చిన 420 హామీలు నెరవేర్చలేక ప్రజలకు మొఖం చూపించుకోలేక భయాందోళనలతో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎక్కడ ప్రశ్నిస్తుందో అనే భయంతో స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను రక్షణ కవచంగా ఏర్పరచుకొని వారి ప్రజా సేవలను దుర్వినియోగం చేసుకుంటూ ప్రజాప్రతినిధులు అయిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులను జిల్లా అధ్యక్షులు బీసం ఆంజనేయులు, గురువారం ఉదయమే జిల్లా ప్రధాన కార్యదర్శి నార్మల్ నరేష్ యాదవ్ ను ఉదయం 6 గంటలకు ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంలో జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి ప్రజల మధ్య తిరిగే అర్హత కోల్పోయారని నిరుద్యోగులకు ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగులను నియమిస్తామని చెప్పిన్న ముఖ్యమంత్రి ఒక వీఆర్ఏ కుటుంబాలకు జీవో ఉన్న ఉద్యోగం ఇవ్వలేని రాష్ట్ర ముఖ్యమంత్రి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాడని ఇలా నమ్మమంటారని, ఒక ముఖ్యమంత్రి చీరల పంపిణీ కొరకై కోట్లాది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, అధికారం వాళ్లకు వ్యసనాలకు మారిందని ఈ పర్యటన ద్వారా అచ్చంపేట నియోజకవర్గానికి ఒరిగేదేమీ, ప్రభుత్వము పోలీసు శాఖ ద్వారా అరెస్టులు తప్ప ప్రజా సమస్యలు పట్టలేదని ఇది పిరికిపందే చర్య అని ధ్వజమెత్తారు.



