రాజ్యాంగాన్ని గౌరవించడం మాటల్లో కాదు.. ఆచరణలో చూపాలి
అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగిస్తున్న బిజెపి
బిజెపి ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు నారపాక అశోక్
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 26 : రాజ్యాంగాన్ని గౌరవించడం మాటల్లో కాదు.. ఆచరణలో చూపాలని బిజెపి ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు నారపాక అశోక్ అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు నారపాక అశోక్ నాయకత్వంలో గురువారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. రాజ్యాంగం అందించిన హక్కులు, సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని ఈ సందర్భంగా నాయకులు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా నారపాక అశోక్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ, న్యాయం, గౌరవంతో జీవించే అవకాశాన్ని కల్పించిందని పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను గౌరవిస్తూ, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ విలువలకు ప్రాధాన్యతనిస్తోందన్నారు. రాజ్యాంగాన్ని కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం కాకుండా, దాని విలువలు, స్ఫూర్తి, నిబంధనలను గౌరవిస్తూ ప్రజలకు పాలన అందించాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ పార్టీపై ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడుతున్నప్పటికీ, రాజ్యాంగ విలువలను రాజకీయ విమర్శలకు పరిమితం చేయకుండా వాటిని ఆచరణలో పాటించాలని అన్నారు. రాజ్యాంగాన్ని గౌరవించడం, ప్రజాస్వామ్య వ్యవస్థలను బలోపేతం చేయడం, ప్రజలకు న్యాయం జరిగేలా కృషి చేయడమే నిజమైన రాజ్యాంగ పరిరక్షణ అని స్పష్టం చేశారు. దళితుల అభ్యున్నతి, సామాజిక సమానత్వం, విద్య, ఉపాధి, ఆర్థిక సాధికారత, రాజకీయ భాగస్వామ్యం వంటి అంశాలకు భారతీయ జనతా పార్టీ ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి ఆలోచనలు, ఆశయాలు దేశ నిర్మాణానికి మార్గదర్శకాలని, ఆయనకు గౌరవం ఇవ్వడం అంటే ఆయన రూపొందించిన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, అందులోని హక్కులు ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేయడమేనని పేర్కొన్నారు. దళిత సమాజం రాజ్యాంగంపై పూర్తి విశ్వాసంతో, తమ హక్కుల పట్ల అవగాహన కలిగి, విద్యా, సామాజిక, రాజకీయ రంగాల్లో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దళితుల గౌరవం, సంక్షేమం, అభివృద్ధి, సాధికారత కోసం భారతీయ జనతా పార్టీ నిరంతరం కృషి చేస్తుందని, అంబేద్కర్ ఆశయాలను ఆచరణలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని నారపాక అశోక్ తెలిపారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ఆచరించాలని, దేశ ఐక్యత, సమగ్రత, ప్రజాస్వామ్య బలోపేతానికి కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల బిజెపి పట్టణ అధ్యక్షులు కాశెట్టి తిరుపతి, మున్సిపల్ కౌన్సిలర్లు నిమ్మల నాగరాజు, గట్టుపెల్లి మానస జ్ఞానేశ్వర్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మర్రిపల్లి సత్యం, వాణిజ్య సెల్ జిల్లా కన్వీనర్ సిరిపురం శ్రీనివాస్, ఎస్సీ మోర్చా జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శులు బన్న సంజీవ్, కొండా యుగేందర్, బీజేపీ జగిత్యాల పట్టణ ప్రధాన కార్యదర్శులు ఆముద రాజు, ఇట్యల రాము, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు ఎర్ర రాజు, దుబ్బ శ్రవణ్, కొత్తూరి అంజి, జిల్లా కార్యదర్శులు దేవి రజినీకాంత్, గూనుకొండ నరేష్, బెత్తెపు నర్సయ్య, దుబ్బ అంజయ్య, ఎస్సీ మోర్చా జగిత్యాల పట్టణ అధ్యక్షులు నక్క జీవన్ తదితర బీజేపీ, బీజేపీ ఎస్సీ మోర్చా నాయకులు పాల్గోన్నారు.



